హైదరాబాద్, ఆట ప్రతినిధి: అఖిల భారత జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్-జిమ్క్విన్లో హైదరాబాద్‌కు చెందిన ది గాడియం స్కూల్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. గాడియం స్కూల్ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో 15 రాష్ర్టాల నుంచి 1200 మందికి పైగా వర్ధమాన జిమ్నాస్ట్‌లు పాల్గొన్నారు. ఆతిథ్య గాడియం 174 స్వర్ణాలు, 158 రజతాలు, 140 కాంస్యాలతో మొత్తం 472 పతకాలు కైవసం చేసుకుంది. హైఫ్లయర్స్ జిమ్నాస్టిక్స్ అకాడమీ 72 స్వర్ణాలు సహా మొత్తం 246 పతకాలు గెలిచి రన్నరప్‌గా నిలిచింది.