హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పగటిపూటే ప్రజాధనాన్ని, రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను స్వయంఉపాధి పథకంలా తన సొంత కుటుంబసభ్యులకు రాసిస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. వడ్డించేవాడు మనవాడైతే చాలన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అనే షెల్ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎలా కేటాయిస్తారని ఆయన నిలదీశారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సోదరుడైతే ఏదైనా చేయవచ్చా? రూ.లక్షతో కంపెనీ పెట్టిన ప్రతి వ్యక్తికీ ఐదెకరాల ప్రభుత్వ భూమి ఇస్తారా? కొండల్‌రెడ్డికి మాత్రమే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. టెస్సెరాక్ట్ కంపెనీ ఎవరిదో, దాని వెనుకున్న వ్యక్తులెవరో? ప్రభుత్వ భూమి ఎందుకు కేటాయించారో? ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. టెస్సెరాక్ట్ వ్యవహారంతోపాటు స్వచ్ఛ్ బయో, అమృత్ టెండర్లు, సింగరేణి, కలెక్టర్లతో దండాలు పెట్టించుకోవడం వరకు.. అనుముల బ్రదర్స్ బాక్స్ ఆఫీస్ లూటీ కలెక్షన్లపై తేల్చేదాకా వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రేవంత్ సోదరులు రాత్రికి రాత్రే కంపెనీల చైర్మన్లు అవుతున్నరు
టెస్సెరాక్ట్ అడ్వాన్డ్స్ సిస్టమ్స్, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు తాను బాధ్యత వహిస్తున్నట్టు అనుముల కొండల్‌రెడ్డి తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్‌లో పేరొన్నారని కేటీఆర్ చెప్పారు. ‘ఏమీ చదువుకోని రేవంత్ సోదరులంతా కోట్లు వేసుకొని రాత్రికిరాత్రే కంపెనీలకు చైర్మన్లు అయిపోతున్నారు. యూఎస్ కాన్సులేట్, అమెరికా ఎంబసీ ప్రతినిధులతో హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ఫోరం ఎగ్జిక్యూటివ్ బోర్డులోనూ కొండల్‌రెడ్డి భాగమయ్యారు. సీఎం తమ్ముడనే ఒకే ఒక అర్హతతో ఈ పదవులు దకాయి’ అని విమర్శించారు. యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెస్సెరాక్ట్ చైర్మన్‌గా కొండల్‌రెడ్డి చేరినట్టు సంబంధిత సంస్థ ప్రకటించిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కేటీఆర్ మీడియాకు చూపించారు.
రూ.200 కోట్ల భూమి.. రూ.7కోట్లకే అప్పనంగా
టెస్సెరాక్ట్ కంపెనీ వ్యవహారాల్లో అనేక అనుమానాస్పద అంశాలు వెలుగుచూశాయని కేటీఆర్ చెప్పారు. ‘రూ.లక్ష మూలధనంతో నడుస్తున్న టెస్సెరాక్ట్ అనే ఊరూపేరు లేని షెల్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన 5 ఎకరాల భూమిని అప్పనంగా కట్టబెట్టింది. మారెట్ ధర ప్రకారం రూ.200 కోట్లు విలువ చేసే ఈ భూమిని గజానికి సుమారు రూ.3,700 చొప్పున కేవలం రూ.7 కోట్లకు రాసిచ్చారు. ఈ కంపెనీ ఏరోస్పేస్, డిఫెన్స్ పరికరాలు తయారు చేస్తుందట! చిత్రమేమిటంటే.. 2025 మార్చి 31న ఆ కంపెనీ స్వయంగా ఇచ్చిన నివేదిక ప్రకారం.. అందులో ఒకటంటే ఒక ఉద్యోగి కూడా లేడు. ఫోన్ నంబర్ చూస్తే 123456789 అని ఉంది. ఇలాంటి నంబర్లు ఉంటాయని మాకు తెల్వదు. రేవంత్ ఏమైనా కొత్త టెక్నాలజీ కనిపెట్టారా? పటాన్చెరు ప్రాంతంలో ఒక చిన్న చిరునామాను కార్యాలయంగా చూపిస్తున్నారు. ఇలాంటి ఫేక్ నంబర్లతో నడిచే బోగస్ కంపెనీకి రూ.200 కోట్ల భూమి కట్టబెట్టడం ఏ రకమైన పరిపాలన? రేవంత్‌రెడ్డి ఏమైనా కొత్త మోసపు టెక్నాలజీ కనిపెట్టారా?’ అని కేటీఆర్ నిలదీశారు. భూమి కేటాయించినట్టు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు, ధర నిర్ణయం, అర్హత ప్రమాణాలు, పెట్టుబడి ప్రతిపాదనలు, ఉద్యోగాల కల్పన హామీలు, ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు.
అనుముల జగదీశ్‌రెడ్డి సంగతీ తేలుస్తాం..
టెస్సెరాక్ట్ వ్యవహారం మాత్రమే కాకుండా సీఎం కుటుంబసభ్యులు, బంధువుల ఇతర వ్యాపారాలు, భూములు, ఒప్పందాలు, కాంట్రాక్టులపైనా గతంలో తాము ప్రశ్నలు లేవనెత్తామని కేటీఆర్ గుర్తుచేశారు. సీఎం మరో సోదరుడు జగదీశ్‌రెడ్డి అమెరికాలో ఉండగా, ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా స్వచ్ఛ్ బయో సంస్థతో సుమారు రూ.వెయ్యి కోట్ల ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూ జరిగిందని పేరొన్నారు. ఆ ఒప్పందం తర్వాత ఆ సంస్థకు ఎకడైనా భూములు కేటాయించారా? పెట్టుబడులు వచ్చాయా? అనే అంశాలను కూడా వెలికితీస్తామని తెలిపారు.
బావమరిది సృజన్‌రెడ్డి కాంట్రాక్టులపై నిలదీశాం
సీఎం బావమరిది సృజన్‌రెడ్డికి సంబంధించిన రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టులపై గతంలోనే ప్రశ్నలు లేవనెత్తామని కేటీఆర్ గుర్తుచేశారు. సింగరేణి, సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, ఇతర కాంట్రాక్టుల్లోనూ అక్రమాలు జరిగాయని తాము గతంలో ఆధారాలతో ప్రజల ముందుంచామని చెప్పారు. ఇప్పుడు టెస్సెరాక్ట్ వ్యవహారం అదే పరంపరలో తాజాగా వెలుగులోకి వచ్చిన అంశమని పేరొన్నారు.
సీఎం సోదరులకు ప్రత్యేక అధికారాలా?
సీఎం మరో సోదరుడు అనుముల తిరుపతిరెడ్డికి ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా కొడంగల్‌లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. కలెక్టర్లు, ఎస్పీలు ఆయన సమక్షంలో పాల్గొంటున్నారని, అధికారిక ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో అనధికారిక ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారని విమర్శించారు. లగచర్లలో భూసేకరణ తర్వాత ప్లాట్ల పంపిణీ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి సోదరులకు ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన కాంట్రాక్టులు, కంపెనీలపైనా తాము గతంలో ప్రశ్నలు లేవనెత్తామని గుర్తుచేశారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ వనరులు, భూములు, కాంట్రాక్టులు దకుతున్నాయా? లేదా? అనే అంశంపై సమగ్ర దర్యాప్తు జరుగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
వదిలేది లేదు.. తేల్చేదాకా పోరాడుతాం
టెస్సెరాక్ట్ భూ కేటాయింపు వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కేటీఆర్ స్పష్టంచేశారు. త్వరలోనే తెలంగాణ గవర్నర్‌ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని, సమగ్ర విచారణ జరిపించాలని కోరుతామని తెలిపారు. అవసరమైతే లోకాయుక్తను, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని ప్రకటించారు. భూమి కేటాయింపు నుంచి కంపెనీ కార్యకలాపాల వరకు ప్రతి అంశాన్నీ విచారించి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగిందా? ఎవరికి ప్రయోజనం కలిగిందనే విషయాలను తేల్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్, జీవన్‌రెడ్డి, సోమ భరత్‌కుమార్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, వై సతీశ్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సుమిత్రా ఆనంద్, లక్ష్మీనర్సింహారావు, తుంగ బాలు, తొట్ల స్వామియాదవ్, పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, రాజేశ్రావు తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటకలో ఒక న్యాయం..తెలంగాణలో ఒక న్యాయమా?
కర్ణాటక పరిణామాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ద్వంద్వ నీతిని కేటీఆర్ ప్రశ్నించారు. ‘కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య సతీమణికి మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మూడెకరాల భూముల కేటాయించడంపై వివాదం కావడంతో లోకాయుక్త తీవ్రంగా స్పందించింది. అకడ సీఎం రాజీనామా చేసే దాకా పరిస్థితి వచ్చింది. అక్కడ మూడెకరాలకే ఇంతటి విచారణ, రాజకీయ ప్రకంపనలు వచ్చినప్పుడు తెలంగాణలో రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కేటాయింపుపై ఎందుకు విచారణ జరుగకూడదు? అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండి, సీఎం సొంత తమ్ముళ్లకు రూ.200 కోట్ల భూములు, రూ.1,000 కోట్ల కాంట్రాక్టులు అప్పనంగా రాసిస్తుంటే చర్యలు ఎందుకు లేవు? కర్ణాటకలో ఒక న్యాయం, తెలంగాణలో మరో న్యాయమా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
సిగ్గులేకుండా బుకాయిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు
టెస్సెరాక్ట్కు సీఎం సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సిగ్గులేకుండా బుకాయిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కొండల్‌రెడ్డి స్వయంగా తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్‌లో టెస్సరాక్ట్ చైర్మన్‌గా పెట్టుకుంటే లేదని చెప్పడానికి మంత్రిగారికి మనసెలా ఒప్పిందో? అసలు మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా? లేదా తెలిసే ఈ దందాలకు ముసుగు వేస్తున్నారా?’ అని నిలదీశారు. యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్ కూడా ఆయనను టెస్సరాక్ట్ చైర్మన్‌గా పేరొ న్నప్పుడు ఎలా సంబంధం లేదని చెప్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సోదరుడికి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా?’ అని నిలదీశారు.
వడ్డించేవాడు మనోడైతే చివరి బంతిలో కూర్చున్నా దకుతుందన్నట్టు రేవంత్‌రెడ్డి సరార్ తెలంగాణ భూములను తన కుటుంబానికి పంచేస్తున్నది.
అమృత్సామ్, సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ల బోగస్ దందా, సింగరేణి కుంభకోణం పరంపరలో మేము బయటపెట్టిన తాజా ఘోర కలియే
ఈ టెస్సెరాక్ట్ సామ్. సీఎం సోదరులైతే ఏమైనా చేయొచ్చా? భూకేటాయింపుల కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదు. – కేటీఆర్
సీఎం రేవంత్ సోదరులకు ప్రత్యేక అధికారాలు ఏమైనా ఉన్నాయా? అనుముల తిరుపతిరెడ్డికి ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి అధికారిక ప్రారంభోత్సవాలు చేస్తున్నడు. కొడంగల్‌లో అనధికారిక ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నడు. నిన్న గాక మొన్న ముఖ్యమంత్రి అల్లుడి కోసం, ఆయన పార్ట్నర్గా ఉన్న మ్యాక్స్ బీఎన్ ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూములు లాక్కున్నరు. భూసేకరణ తర్వాత ప్లాట్ల పంపిణీ కార్యక్రమానికీ తిరుపతిరెడ్డే ముఖ్య అతిథి. ఆయనేమన్నా వార్డు మెంబరా? కౌన్సిలరా? ప్రజాప్రతినిధా? ఇదేనా ప్రజాపాలనా? అనుముల కుటుంబపాలనా? ముఖ్యమంత్రి కుటుంబం దోపిడీ చేస్తే మంత్రులు వంతపాడటమే ప్రజాపాలనా? – కేటీఆర్
ప్రజాపాలన కాదిది కుటుంబ పాలన!