బర్త్‌డే వేడుకల్లో గద్వాల ఎమ్మెల్యే
పంటలెండి, కడుపు మండిన అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే.. వారు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే మాత్రం ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. జూరాల నుంచి సాగునీరైనా ఇవ్వండి.. లేకుంటే విషమైన ఇవ్వండి.. అంటూ సోమవారం రైతులు భారీ నిరసన చేపట్టి అరిగోస పడుతుంటే, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అదేరోజు బర్త్‌డే సంబురాల్లో పాల్గొనడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. జిల్లా కేంద్రంలోనే ఎమ్మెల్యే ఉన్నా..
గద్వాల, సెప్టెంబర్ 21: పంటలెండి, కడుపు మండిన అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే.. వారు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే మాత్రం ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. జూరాల నుంచి సాగునీరైనా ఇవ్వండి.. లేకుంటే విషమైన ఇవ్వండి.. అంటూ సోమవారం రైతులు భారీ నిరసన చేపట్టి అరిగోస పడుతుంటే, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అదేరోజు బర్త్‌డే సంబురాల్లో పాల్గొనడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. జిల్లా కేంద్రంలోనే ఎమ్మెల్యే ఉన్నా.. 6 గంటల పాటు అక్కడే రైతులు ధర్నా చేసినా వారి వద్దకొచ్చి సమస్యను తెలుసుకొనే సమయం ఆయనకు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ‘రైతుల వెంటే నేనుంటా.. గద్వాల అభివృద్ధి కోసమే పార్టీ మారా’ అని చెప్పుకొన్న ఎమ్మెల్యే మమ్మల్ని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రోడ్డుప ఎర్రటి ఎండలో నిరసన రాస్తారోకో చేస్తుంటే, అటువైపు ఎమ్మెల్యే కన్నెత్తి చూడటమే లేదని మండిపడుతున్నారు. పంటలు ఎండిపోయి తాము అవస్థలు పడుతుంటే, ఎమ్మెల్యే మాత్రం జన్మదిన వేడుకల్లో ఆనంద పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తామంతా బతుకుదెరువుకు ఆరాట పడుతుంటే, ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడమే లేదని ప్రశ్నిస్తున్నారు. ఆనాడు రైతుల పంటపొలాలకు నీటిని విడుదల చేయాలని, లేనిపక్షం లో ఆందోళనకు సిద్ధమవుతున్నానని చెప్పిన ఎమ్మెల్యే తన ఉనికిని కాపాడుకొన్నారని, 2 నెలలు నీటిని విడుదల చేసిన తర్వాత పంట చేతికొచ్చే దశలో నీటిని నిలుపుదల చేసి రైతుల గొంతు కోశాడని రైతులు ధ్వజమెత్తుతున్నారు. జూరాల కాలువ నీటి విడుదల సమయంలో పూలు చల్లి ఆర్భాటం చేసి రైతుల చెవుల్లో పూలు పెట్టారని మండిపడుతున్న్నారు. నాడు కాలువలకు నీటిని విడుదల చేసే సమయంలో పంటలు ఎండకుండా నీరు అందిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఇప్పుడు పంటలెండిపోతున్నా రైతుల గోస పట్టించుకోవడమే లేదని అంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

