Benjamin Netanyahu :ఇరాన్ సైన్యం దాడుల్లో తాను మరణించినట్టు ప్రచారమవుతున్న వార్తలకు ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) చెక్ పెట్టారు. తాను బతికే ఉన్నానని.. ఇరాన్, పాకిస్థాన్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఆదివారం కాఫీ షాపు వెళ్లిన నెతన్యాహు.. కాఫీ తాగుతున్న వీడియో పంచుకున్నారు. అందులో ఆయన తన గురించి శత్రువులు ఏం అనుకుంటున్నారో చెప్పారు.
తమ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయేల్ ప్రధానిని తుదముట్టిస్తామని ఇరాన్ ప్రతినబూనింది. ఈ క్రమంలోనే బెంజమిన్ నెతన్యాహూ లక్ష్యంగా ఇరాన్ సైన్యం జరిపిన దాడుల్లో.. ఆయన మరణించారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. తాజాగా నెతన్యాహూ మరణించారని ఒక ఏఐ వీడియో కూడా బయటికొచ్చింది. దాంతో, తాను మరణించినట్టు వస్తున్న తప్పుడు
వార్తలపై నెతన్యాహు నేరుగా కొత్త వీడియోతో స్పందించారు.
אומרים שאני מה? צפו >> pic.twitter.com/ijHPkM3ZHZ
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) March 15, 2026
‘నేను కాఫీ కోసం చనిపోయాను’ అని హిబ్రూ సంజ్ఞలతో తాను చనిపోయినట్టు ప్రచారంలో ఉన్న వదంతులకు ఆయన ముగింపు పలికారు. అంతేకాదు ‘నా దేశం చనిపోవడాన్ని నేను ఇష్టపడుతా’ అని చెప్పిన నెతన్యాహూ.. తనకు ఆరు చేతులున్న వీడియోపై కాస్త వ్యంగ్యంగా స్పందించారు. తన చేతివేళ్లను కెమెరా వైపు చూపించిన ఆయన.. ‘చూడండి నా చేతులకు పది వేళ్లే ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ఇజ్రాయేల్ ప్రధాని కార్యాలయం సైతం ఒక ప్రకటలో ‘నెతన్యాహూ మరణ వార్తలు అన్నీ అవాస్తవం. మా ప్రధాని బతికే ఉన్నారు’ అని వెల్లడించింది.