తెలంగాణ బ్రాండ్ పెరిగేలా గ్లోబల్ సమ్మిట్
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరింత ఇనుమడించేలా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లు అత్యంత వైభవంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
- రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరింత ఇనుమడించేలా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లు అత్యంత వైభవంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సమ్మిట్ ప్రారంభ గడువు (డిసెంబర్ 7) సమీపిస్తున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వివిధ దేశాల నుంచి సుమారు 1,500 మంది గ్లోబల్ సీఈవోలు, ఎండీలు, రాయబారులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో ఎకడా చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా సిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించారు. 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ప్రధాన వేదిక, ఎక్స్పో జోన్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రవాణా కనెక్టివిటీతో పాటు అతిథులకు కల్పిస్తున్న వసతులపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం ప్రత్యే క సమీక్ష నిర్వహించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

