హెచ్‌సీఏలో నిబంధనల ఉల్లంఘన
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) అపెక్స్ కౌన్సిల్ పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరుగుతోందని సంఘం సభ్యులు ఆరోపించారు.
- ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారని సభ్యుల ఆరోపణ
హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) అపెక్స్ కౌన్సిల్ పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరుగుతోందని సంఘం సభ్యులు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని హైకోర్టు నియమించిన సింగిల్ మెంబర్ కమిటీ (ఎస్ఎంసీ) సభ్యుడు రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావుకు మొరపెట్టుకున్నా స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అకాడమీలు నడుపుతున్న వారిని సెలెక్టర్లు, కోచ్‌లుగా నియమించి నిబంధనలు ఉల్లంఘించారని మంగళవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ అధ్యక్ష, కార్యదర్శులు అర్షద్ ఆయుబ్, జాన్ మనోజ్, పలువురు సభ్యులు ఆరోపించారు. ఇక, అపెక్స్ కౌన్సిల్ ను తాత్కాలికంగా కొనసాగించాలన్న హైకోర్టు ఉత్తర్వులను ఇప్పటికే సవాల్ చేసినట్టు తెలిపారు. పదవీకాలం ముగిసిన అపెక్స్ కౌనిల్ కొనసాగడం హెచ్ సీ ఏ రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. తక్షణమే ఎస్జీఎం తేదీని ప్రకటించి, ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

