‘క్రీడాభివృద్ధిలో వ్యాయామ విద్యదే కీలక పాత్ర’
దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించడంలో వ్యాయామ విద్య పాత్ర ఎంతో కీలకమని, క్రీడలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి ప్రొఫెసర్ పియూష్ జైన్ అన్నారు.
హైదరాబాద్,ఆట ప్రతినిధి : దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించడంలో వ్యాయామ విద్య పాత్ర ఎంతో కీలకమని, క్రీడలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి ప్రొఫెసర్ పియూష్ జైన్ అన్నారు. మంగళవారం ఎల్బీ స్టేడియం ఆవరణలో జై ఇండియా లెజెండ్ (జేబీఎల్) ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ..
తెలంగాణలో వేలాది మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసినా, క్రీడా రంగంలో సరైన అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. క్రీడలకు మరింత ఊతమిచ్చేందుకు శిక్షణ పూర్తి చేసుకున్న వారంతా ఖేలో ఇండియా ఎన్ఎస్ఎస్ఆర్లో రిజిస్టేష్రన్ చేసుకోవాలని, దీనివల్ల గుర్తింపుతో పాటు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం లభిస్తుందని సూచించారు. ఆయన సూచన మేరకు తెలంగాణలో రిజిస్టేష్రన్లను వేగవంతం చేస్తామని జేబీఎల్ ట్రస్ట్ డైరెక్టర్ బాబులాల్ తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

