Kondapur : హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని నెల్లూరుకు చెందిన పవన్(32) గా గుర్తించిన పోలీసులు అతడి నుంచి 8 కిలోల గంజాయి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో డెలీవరీ బాయ్‌గా పనిచేస్తున్న పవన్ గుట్టుగా గంజాయి కూడా అమ్ముతున్నట్టు పోలీసులు వెల్లడించారు. గంజాయి విక్రయిస్తున్న పవన్‌ను మరింతగా విచారించి.. పూర్తి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.