Suriya and Jyotika | వివాహా బంధానికి 20 ఏండ్లు.. పిల్లల సమక్షంలో మరోసారి ఒక్కటైన సూర్య – జ్యోతిక!
Suriya Jyotika | కోలీవుడ్‌లో అత్యంత ఆదర్శవంతమైన స్టార్ దంపతులుగా పేరు తెచ్చుకున్న సూర్య, జ్యోతిక మరోసారి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
కోలీవుడ్‌లో అత్యంత ఆదర్శవంతమైన స్టార్ దంపతులుగా పేరు తెచ్చుకున్న సూర్య, జ్యోతిక మరోసారి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమ వివాహం జరిగి 20 ఏళ్లు పూర్తి కావడంతో, తమ పిల్లలు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో వారు ఘనంగా పెళ్లి వేడుకలు చేసుకున్నారు.
నిజానికి సూర్య, జ్యోతికలు 2006 సెప్టెంబర్ 11న వివాహం చేసుకున్నారు. అప్పట్లో పెద్దల అంగీకారంతో ఘనంగా ఒక్కటైన ఈ జంట, ఇండస్ట్రీలోనూ రియల్ లైఫ్‌లోనూ బెస్ట్ కపుల్‌గా నిలిచింది. ఇప్పుడు సరిగ్గా ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారు మరోసారి ఈ వేడుకను జరుపుకున్నారు. ఈ సుందరమైన క్షణాలను ‘ది సీక్వెల్ – 20 ఏళ్ల ప్రేమ, పోరాటం’ అంటూ అభివర్ణిస్తూ, ఇందుకు సంబంధించిన ప్రత్యేక వీడియోను వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా జ్యోతిక మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక పెళ్లి వేడుక మాత్రమే కాదని, తమ మధ్య ఉన్న అపరిపూర్ణతలను, సర్దుబాట్లను, అవగాహనను, త్యాగాలను, నిస్వార్థమైన ప్రేమను సెలబ్రేట్ చేసుకునే అద్భుతమైన క్షణమని భావోద్వేగంతో పంచుకున్నారు. తమ పిల్లల సమక్షంలో జరిగిన ఈ వేడుక తమ ప్రయాణానికి మరింత ప్రత్యేకతను తెచ్చిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం సూర్య, జ్యోతికల ఈ అరుదైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలతో పాటు అభిమానులు ఈ క్యూట్ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
• EXCLUSIVE : 20th Wedding Anniversary Celebration Of @Suriya_offl & #Jyothika 🤍 pic.twitter.com/6SEThcDQ5r
— Suriya Fans Team™ (@SuriyaFansTeam) September 15, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

