Stock Markets | భారీ పతనం నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. ఇవాళ లాభాలతో ట్రేడింగ్ షురూ..!
Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు (Stock Markets) మంగళవారం (నిన్నటి) నాటి భారీ పతనం నుంచి కోలుకున్నాయి. ఇవాళ (బుధవారం) ట్రేడింగ్ లాభాలతో మొదలైంది. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty) లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 456 పాయింట్ల లాభంతో 74,460 వద్ద.. నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 23,254 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Stock Markets : భారత స్టాక్ మార్కెట్లు (Stock Markets) మంగళవారం (నిన్నటి) నాటి భారీ పతనం నుంచి కోలుకున్నాయి. ఇవాళ (బుధవారం) ట్రేడింగ్ లాభాలతో మొదలైంది. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty) లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 456 పాయింట్ల లాభంతో 74,460 వద్ద.. నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 23,254 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. జీఐఎఫ్టీ నిఫ్టీ నుంచి అందిన సానుకూల సంకేతాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి.
మంగళవారం నాటి ట్రేడింగ్లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్ 777 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 279 పాయింట్లు నష్టపోయి 23,118 వద్ద ముగిసింది. ఇది గత ఐదు నెలల్లో నిఫ్టీకి అత్యంత కనిష్ఠ ముగింపు స్థాయి కావడం గమనార్హం. ఇంట్రాడేలో లాభాల్లో ఉన్నప్పటికీ, అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. బుధవారం నాటి ట్రేడింగ్లో యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) కు సంబంధించిన సానుకూల వార్తల నేపథ్యంలో పేటీఎం షేరు ఏకంగా 7 శాతం వరకు పెరిగింది.
దాంతో ఇతర పేమెంట్ కంపెనీల షేర్లపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. అయితే మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనప్పటికీ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) మంగళవారం రూ.2,977 కోట్లు నికరంగా అమ్మకాలు జరపడం ఒత్తిడికి కారణంగా ఉంది. మరోవైపు ముడిచమురు ధరలు, అమెరికా బాండ్ యీల్డ్స్ అధిక స్థాయిలో కొనసాగడం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ రాత్రికి వెలువడనున్న అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి.
ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం తర్వాతే మార్కెట్ భవిష్యత్ దిశ స్పష్టమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

