TVK Vijay | విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి.. టీవీకేకు 80 సీట్లు ఆఫర్ చేసిన బీజేపీ
TVK Vijay : తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొత్తగా టీవీకే పార్టీ పెట్టిన స్టార్ హీరో విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు 80 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
TVK Vijay : తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొత్తగా టీవీకే పార్టీ పెట్టిన స్టార్ హీరో విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు 80 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇరుపార్టీలకు సంబంధించిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ, టీవీకే పార్టీల మధ్య పొత్తుల విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ చర్చలు తుదిదశలో ఉన్నాయి.
బీజేపీ, టీవీకే కలిస్తే ఎన్డీయే కూటమిగా తమిళనాడులో పోటీ చేస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రతిపాదనల ప్రకారం టీవీకేకు 80 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైంది. అలాగే విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇస్తామన్నారు. కానీ, విజయ్ మాత్రం ముఖ్యమంత్రి పీఠంపై గురి పెట్టారు. ఇదే ఈ చర్చల్లో కీలకంగా మారింది. మరోవైపు ఈ చర్చలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ తీసుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ, ఈ అంశంలో పవన్ వైపు నుంచి ఎలాంటి స్పష్టతా లేదు. తమిళనాడులో విజయ్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇలాంటి నటుడి మద్దతు దొరికితే తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. రెండు శాతం ఓట్లు తమిళనాడు రాజకీయాల్ని మార్చగలవని బీజేపీ భావిస్తోంది. అందుకే విజయ్ తమతో తోడైతే ఆ రెండు శాతం ఓట్లు తమవైపు మళ్లుతాయని బీజేపీ అంచనా.
అయితే, బీజేపీతో చేరితే తమ విశ్వసనీయత దెబ్బతింటుందని టీవీకేకు చెందిన కొందరు నేతలు భావిస్తున్నారు. విజయ్ సొంత ఇమేజ్ను కోరుకుంటున్నాడని, తమ పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా ఉండాలని అక్కడి నేతలు అంటున్నారు. అయితే, టీవీకేతో పొత్తు అంశం త్వరలోనే తేలనుంది. ఇక తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదల కానుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- deputy cm
- NDA
- Tamil Nadu
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

