Srikanth Odela | తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ 34వ వార్షికోత్సవానికి ది ప్యారడైజ్ (THE PARADISE) మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల హాజరయ్యాడు. మోహన్ బాబు నాని నటిస్తోన్న ది ప్యారడైజ్లోశికంజ మాలిక్ అనే విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
ఈవెంట్లో ఇదే విషయమై శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. యాక్టర్‌గా మోహన్ బాబు సార్కున్న సామర్థ్యం ఏంటో ఓ వర్గం ప్రేక్షకులకు అవగాహన లేదు. మనం మిస్సవుతున్న మోహన్ బాబును సిల్వర్ స్క్రీన్‌పై చూపించేందుకు 100 శాతం ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువేం చెప్పలేను.. ఎందుకంటే టీజర్, ట్రైలర్ ఆయన గురించి ఎక్కువగా చెప్తాయన్నాడు. శ్రీకాంత్ ఓదెల చేసిన ఈ కామెంట్స్ సినిమాపై అంచనాలు పెంచడంతోపాటు మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ఇక నాని అభిమానులు నెక్ట్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నాడంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం 2026 ఆగస్టు 21న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో కయాదు లోహర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. తనికెళ్లభరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన నాని, మోహన్ బాబు పోస్టర్లు, గ్లింప్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ది ప్యారడైజ్‌లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి సోనాలి కులకర్ణి కీ రోల్లో నటిస్తుండగా.. కిల్ ఫేం రాఘవ్ జుయల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓ వైపు బ్లాక్ బస్టర్ దసరా కాంబో రిపీట్ అవడం, మరోవైపు జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత నాని-అనిరుధ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్‌పై క్యూరియాసిటీ పెరిగిపోతుంది.