Hebah Patel | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ హెబ్బా పటేల్ (Hebah Patel ). గ్లామరస్ పాత్రలతో, నటనకు ఆస్కారమున్న కథలతో ప్రేక్షకులను పలుకరిస్తూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కుమారి 21ఎఫ్, ఓదెల రైల్వే స్టేషన్, హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నఈ ముద్దుగుమ్మ చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. ఈ బ్యూటీ తాజాగా చిత్రాలయ క్రియేషన్స్ బ్యానర్‌పై ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రొడక్షన్ నంబర్ 3గా రాబోతున్న ఈ చిత్రానికి దర్జా ఫేం మ్యాక్ (సలీం మాలిక్)దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యాక్ కథ, స్క్రీన్‌ప్లే కూడా సమకూరుస్తున్నాడు. ఎమోషనల్, కామెడీ జోనర్లో రాబోతున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. శ్రీలక్ష్మి ఎం నిర్మిస్తున్న ఈ చిత్రానికి కేవీఆర్ అడిషనల్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. ఎం సమీర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీకి భాష్య శ్రీ మాటలు, పాటలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది హెబ్బా పటేల్ టీం.
హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్న హెబ్బా పటేల్ ఈ సారి సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నది ఆసక్తికరంగా మారింది.
Poorna | పూర్ణ ఇంట్లో అడుగుపెట్టిన మహాలక్ష్మి.. రెండోసారి తల్లైన టాలీవుడ్ నటి
Seasonal Allergies | సీజన్ మారుతోంది.. ఈ సమయంలో వచ్చే అలర్జీల నుంచి ఇలా తప్పించుకోండి..
Uttar Pradesh | కెరీర్‌పై ఫోకస్ చేయమన్నందుకు కవల సోదరి హత్య.. 84 సార్లు కత్తితో పొడిచి చంపిన సోదరుడ