Annamalai | సీఎం విజయ్ లండన్ పర్యటనపై అన్నామలై తీవ్ర విమర్శలు..!
Annamalai | తమిళనాడు ముఖ్యమంత్రి (TamilNadu CM) సీ జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ఇటీవల లండన్ (Landon) లో పర్యటించడంపై రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై (K Annamalai) తీవ్ర విమర్శలు చేశారు. యునైటెడ్ కింగ్డమ్ (United Kingdom) ను 'చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ' గా అభివర్ణించిన ఆయన.. విదేశాల నుంచి కాకుండా రాష్ట్రం నుంచే పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించారు.
Annamalai : తమిళనాడు ముఖ్యమంత్రి (TamilNadu CM) సీ జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ఇటీవల లండన్ (Landon) లో పర్యటించడంపై రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై (K Annamalai) తీవ్ర విమర్శలు చేశారు. యునైటెడ్ కింగ్డమ్ (United Kingdom) ను ‘చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ’ గా అభివర్ణించిన ఆయన.. విదేశాల నుంచి కాకుండా రాష్ట్రం నుంచే పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించారు.
మధురైలో మీడియాతో మాట్లాడిన అన్నామలై.. ప్రస్తుతం భారత ఆర్థికవ్యవస్థ విలువ సుమారు 4.1 ట్రిలియన్ డాలర్లు కాగా, యూకే ఆర్థికవ్యవస్థ కేవలం 3.4 ట్రిలియన్ డాలర్లు మాత్రమేనని గుర్తుచేశారు. కేవలం 1 శాతం వృద్ధి రేటుతో నెమ్మదిగా సాగుతున్న దేశానికి పెద్ద ప్రతినిధి బృందంతో వెళ్లడంవల్ల ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చినా అవి ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న భారతీయ కంపెనీల అనుబంధ సంస్థల నుంచే వస్తాయని, కొత్తగా విదేశీ మూలధనం రాదని అభిప్రాయపడ్డారు.
విదేశీ పర్యటనలకు బదులుగా ముఖ్యమంత్రి రాష్ట్రంలోని పారిశ్రామిక కేంద్రాలైన కోయంబత్తూరు, మధురై, తూత్తుకుడి వంటి ప్రాంతాల్లో పర్యటించాలని అన్నామలై సలహా ఇచ్చారు. స్థానిక వ్యాపారవేత్తలతో సమావేశమై వారి వ్యాపార విస్తరణకు పన్ను మినహాయింపులు వంటి ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. అలాగే దేశంలోని ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
సీఎం విజయ్ ఆరు రోజుల యూకే పర్యటన ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడులు, 10,000 కు పైగా ఉద్యోగాలు లభించాయని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అన్నామలై ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి పనిచేయడానికి కొంత సమయం ఇవ్వాలని చెబుతూనే, స్థానిక పరిశ్రమల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

