AP Job News | ఏపీలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
AP Job News | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు సువర్ణావకాశం కల్పిస్తుంది. దీంట్లో భాగంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్టులు, అర్హతలు, ఇతర వివరాలు తెలసుకుందాం.
AP Job News | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 26 పోస్టులను నింపనుంది. డిగ్రీ పాసైనవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 వరకు సాగనున్నది.
పోస్టులు
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) ఖాళీలు- 26
అర్హతలు
బోటనీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, లేదా అగ్రికల్చర్ సబ్జెక్టులతో డిగ్రీ పాసై ఉండాలి. ఇంజినీరింగ్‌లో కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ లేదా సివిల్ ఇంజినీరింగ్‌తో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.

Fso
ఎంపిక
సింగిల్ లెవల్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మూడు పేపర్ల క్వాలిఫయింగ్ టెస్ట్ ఉంటుంది. తరువాత వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
వేతనం
ఎంపికైనవారికి నెలకు జీతం రూ. 32,670 – 1,01,970 వరకు ఉంటుంది.
దరఖాస్తు
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 5 వరకు కొనసాగుతుంది.
దరఖాస్తు ఫీజు రూ. 300. బీసీ, ఎస్సీ, ఎస్టీ, తెల్ల రేషన్ కార్డుదారులకు రూ. 250.
ఇతర వివరాలకు వెబ్సైట్ https://psc.ap.gov.in చూడండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

