Korukanti Chander | బూడిద లారీల పేరిట కలెక్టర్ దోపిడీ..! : మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
న్టీపీసీ ఉచితంగా ఇచ్చే బూడిదను తరలించే లారీల నుంచి ఎలాంటి జీవో, సర్క్యులర్ లేకుండానే జిల్లా కలెక్టర్ రూ.500 చొప్పున అక్రమంగా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పెద్దపల్లి, నవంబర్ 18(నమస్తే తెలంగాణ) :ఎన్టీపీసీ ఉచితంగా ఇచ్చే బూడిదను తరలించే లారీల నుంచి ఎలాంటి జీవో, సర్క్యులర్ లేకుండానే జిల్లా కలెక్టర్ రూ.500 చొప్పున అక్రమంగా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడేళ్లలో అధికారికంగానే 1.24 లక్షల ట్రిప్పుల ద్వారా సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు చేశారని, దీనికి ఎలాంటి రసీదులు కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 265 ప్రకారం ప్రభుత్వం ఏ పన్ను లేదా రుసుము వసూలు చేసినా దానికి చట్టబద్ధమైన జీవో ఉండాలని, కానీ ఎవరి ఆదేశాల మేరకు కలెక్టర్ ఈ డబ్బులు వసూలు చేసి ఎవరి ఖజానాలోకి మళ్లించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే తరహాలో మట్టి తరలింపునకు క్యూబిక్ మీటర్‌కు రూ.40-50 వసూలు చేయాల్సి ఉండగా, ఏకంగా రూ.3,500 వసూలు చేస్తూ లారీ యజమానుల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు.
అధికార, అనధికారిక వసూళ్లు, పోలీసుల అక్రమ ఫైన్లు, నెలల తరబడి లారీలను సీజ్ చేయడంతో యజమానులు డీజిల్, డ్రైవర్ల జీతాలు, ఈఎంఐలు కట్టలేక రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్ ఒక బందిపోటు లాగా వ్యవహరిస్తూ లారీ యజమానులను దోచుకుంటున్నారని, జిల్లాలో అసలు చట్టం, ప్రజాస్వామ్యం అనేవే లేకుండా పోయాయని విమర్శించారు. వసూలు చేసిన రూ.6 కోట్ల రూపాయలను తక్షణమే లారీ నంబర్ల ఆధారంగా ఆయా యజమానులకు తిరిగి చెల్లించాలని, లేనిపక్షంలో ఈ అక్రమ వసూళ్లపై డీపీటీఓ, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
అదేవిధంగా లారీలతో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో శ్రీరామ లారీ యాష్ టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె అశోక్, ముత్యం అనిల్ గౌడ్, రాము గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఉప్పు రాజ్ కుమార్, నారాయణదాసు మారుతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Korukanti Chander | బూడిద లారీల పేరిట కలెక్టర్ దోపిడీ..! : మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
Rakul | వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్..క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ
AP news | పల్నాడులో మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్!
Megastar Chiranjeevi | ఎవరినీ అడగలేదు.. కానీ ఆ డైరెక్టర్‌ను మాత్రం నాతో సినిమా చేయమని అడిగా: చిరంజీవి!
CM Yogi Adityanath: హ్యాట్రిక్‌తో రికార్డులు బద్దలు కొడుతాం: యూపీ సీఎం
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

