Benjamin Netanyahu | నెతన్యాహు బాగానే ఉన్నారన్న ఇజ్రాయెల్.. అలా ఐతే చంపేస్తామంటున్న ఇరాన్
Benjamin Netanyahu : బెంజమిన్ క్షేమంగానే ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఆయన యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బహిరంగంగా కనిపించలేదు. ఆయన ఉనికి గురించి ఎలాంటి సమాచారం లేదు.
Benjamin Netanyahu : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంశం ఇప్పుడు విస్తృత చర్చకు దారి తీసింది. ఆయన బతికే ఉన్నారా.. లేదా అనే విషయంలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బెంజమిన్ క్షేమంగానే ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఆయన యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బహిరంగంగా కనిపించలేదు. ఆయన ఉనికి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇదే సమయంలో తాజాగా విడుదలైన నెతన్యాహు వీడియో కూడా పలు అనుమానాలకు తావిచ్చింది.
నెతన్యాహు మాట్లాడుతున్నట్లుగా ఇజ్రాయెల్ విడుదల చేసిన వీడియోలో ఆయన చేతికి ఆరు వేళ్లు కనిపించాయి. దీంతో ఇది ఏఐ వీడియోనే అని నిపుణులు అంటున్నారు. దీంతో నెతన్యాహు మరణించి ఉండొచ్చనే ప్రచారం మరింత ఊపందుకుంది. ఇదే సమయంలో నెతన్యాహు బతికే ఉంటే అంతం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఒక ప్రకటన చేసింది. చిన్న పిల్లల్ని చంపిన క్రిమినల్ నెతన్యాహు ఒకవేళ బతికే ఉంటే ఆయన్ను వెంటాడి మరీ చంపుతామని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇరాన్ యుద్ధం 16వ రోజుకు చేరింది. ఇంతకాలమైనా నెతన్యాహు ఒక్కసారి కూడా ప్రజలముందుకు రాలేదు.
బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఇరాన్ జరిపిన దాడుల్లో హతమయ్యారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ప్రచారాన్ని ఇజ్రాయెల్ ఖండించింది. తమ ప్రధాని క్షేమంగానే ఉన్నారని వెల్లడించింది. అయితే, నెతన్యాహు వీడియో రిలీజ్ కావడం, అది ఏఐ వీడియో అంటూ ప్రచారం జరగడంతో ఆ వీడియోను వెంటనే డిలీట్ చేశారు. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా కూడా అబద్ధాలు చెబుతోందని మరికొందరు అమెరికన్స్ కూడా విమర్శిస్తున్నారు. వారు కూడా నెతన్యాహు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన బయటకు వచ్చి కనిపించేవరకు ఈ అనుమానాలు కొనసాగుతూనే ఉంటాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

