పాట్నా: కొందరు యువకులు ప్రమాదకరంగా బైకులపై విన్యాసాలు చేశారు. పోలీస్ వాహనాన్ని దాటి వెళ్లి స్టంట్లు కొనసాగించారు. (Dangerous Bike Stunts) అయితే ఆ వాహనంలోని పోలీసులు పట్టించుకోలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని చప్రిలో ఈ సంఘటన జరిగింది. రహదారిపై కొందరు యువకులు బైకులపై ప్రమాదకరంగా విన్యాసాలు చేశారు. ఫ్రంట్ వీల్ లిఫ్టింగ్, హ్యండిల్ వదిలేయడం, కదులుతున్న బైక్‌పై నిల్చోవడం వంటి డేంజరస్ స్టంట్లు చేశారు.
కాగా, ఒక చోట పోలీస్ వాహనం ఆగి ఉన్నది. అయినప్పటికీ బైకర్లు విన్యాసాలు ఆపలేదు. పోలీసుల నిర్లక్ష్యాన్ని వారు అలుసుగా తీసుకున్నారు. ప్రమాకర స్టంట్లు కొనసాగించారు. ఆ వాహనంలో ఉన్న పోలీసులు ఏ మాత్రం స్పందించలేదు. తమకు పట్టనట్లుగా వ్యవహరించారు.
మరోవైపు ఒక వాహనదారుడు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కళ్లెదుటే యువకులు బైక్‌లపై విన్యాసాలు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు స్పందించారు. యువకుల డేంజరస్ బైక్ విన్యాసాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Fear of the police is dead in Bihar! Chapri are doing stunts right in front of police vehicles, showing off their lawlessness. Now, let’s see if the Bihar Police actually acts or just watches. @bihar_police @BiharHomeDept @samrat4bjp @NitishKumar @motihari_police pic.twitter.com/OER4wdjWN8
— The Nalanda Index (@Nalanda_index) January 11, 2026
Also Read:
Pipeline Burst | పగిలిన నీటి పైపులు.. నీట మునిగిన కాలనీ
Jagdeep Dhankhar | రెండుసార్లు స్పృహ కోల్పోయిన జగదీప్ ధన్ఖర్.. ఢిల్లీ ఎయిమ్స్‌లో అడ్మిట్
Girl Gang-Raped In Car | 12వ తరగతి విద్యార్థిని కిడ్నాప్.. కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం
Bangladeshi Flag | ఇంటర్నేషనల్ స్కూల్లో బంగ్లాదేశ్ జెండా.. బజరంగ్ దళ్ హెచ్చరిక