కోటా.. దేశంలోనే అతిపెద్ద కోచింగ్ హబ్. అక్కడ గెలిచిన వారంతా మేధావులే. ఈ క్రమంలో మొన్న JEE టాపర్స్‌ని అడిగారు.. ‘మీరు ఏ ఫోన్ వాడుతున్నారు?’ అని. ఆ ప్రశ్నకు లక్షల విలువైన, అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఫోన్లు తీసి చూపిస్తారేమో అని అనుకున్నారంతా. కానీ, ఓ విద్యార్థిని ఒక సాధారణ కీప్యాడ్ ఫోన్ తీసి చూపించింది.. మరొకరు ‘ఐఫోన్ 19’ అని జోక్ చేసి.. ఆపై కీప్యాడ్ ఫోన్ చూపించారు. ఆ వీడియో చూసిన లక్షల మంది ఆశ్చర్యపోయారు.. స్మార్ట్‌ఫోన్స్ లేకుండా ఎలా చదువుకున్నారు? ఈ వీడియో దేశవ్యాప్తంగా ‘స్క్రీన్ టైమ్’పై పెద్ద చర్చకు దారితీసింది. అత్యంత కఠినమైన జేఈఈ (JEE) పరీక్షలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ సక్సెస్ వెనక ఉన్న ఆ ‘చిన్న’ రహస్యాన్ని బయటపెట్టారు. ఇది కేవలం వీడియో కాదు.. మన పిల్లల భవిష్యత్తు గురించి ఓ ప్రశ్న! ఈ డిజిటల్ డిలెమ్మా వెనుక ఉన్న సైకాలజీని ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిందే.
సాధారణ స్మార్ట్‌ఫోన్‌లో రోజుకు సగటున 4-6 గంటలు గడుపుతున్నారు మన పిల్లలు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, గేమ్స్.. ఇవన్నీ కలిపి రోజులో 6 గంటలు తినేస్తున్నాయి! అంటే.. నిద్రపోయే సమయం మినహా.. మిగిలిన సమయంలో 40% స్క్రీన్‌కి సమర్పయామి. ‘15-20 ఏళ్ల వయసు మెదడు అభివృద్ధికి క్రిటికల్ పీరియడ్. ఈ సమయంలో స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉంటే.. అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది.. మెమొరీ వీక్ అవుతుంది.. ఫోకస్ పల్చబడుతుంది. JEE టాపర్స్ కీప్యాడ్ ఫోన్స్ వాడటం వెనుక ఈ సైకాలజీ ఉంది! స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం ఒక డివైజ్ కాదు.. అది మీ పిల్లల మెదడుని కంట్రోల్ చేసే ఒక టూల్! అందుకే చాలా ఇన్స్టిట్యూట్స్ క్యాంపస్‌లో స్మార్ట్‌ఫోన్స్ బ్యాన్ చేశాయి. డిజిటల్ డిస్ట్రాక్షన్స్ లేకుండా పిల్లలు పూర్తి ఫోకస్ స్టడీస్‌పై ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాయి. టాపర్స్ చెప్పే విషయం ఏమిటంటే.. కీప్యాడ్ ఫోన్ వాళ్లకు అవసరమైన కాల్స్, మెసేజెస్‌కు చాలు. సోషల్ మీడియా టెంప్టేషన్ ఉండదు. నోటిఫికేషన్స్ డిస్టర్బ్ చేయవు.
అబ్బాయి సీరియస్‌గా చదువుకుంటున్నాడు.. అప్పుడే ఫోన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది.. ‘2 నిమిషాలు చూస్తాను’ అని తీసుకున్నాడు. కానీ, ఆ 2 నిమిషాలు 2 గంటలుగా మారిపోయాయి! ఎందుకంటే సోషల్ మీడియా యాప్స్ డిజైన్ చేసిన విధానమే అలా ఉంటుంది. ప్రతి స్క్రోల్‌కి ఒక డోపమైన్ హిట్.. ప్రతి వీడియోకి ఒక న్యూ సర్ప్రైజ్. ‘స్మార్ట్‌ఫోన్‌లోని యాప్స్ యూజర్ని ఎంగేజ్ చేయడానికి అడిక్టివ్ డిజైన్స్ వాడతాయి.. ఇన్ఫినిటీ స్క్రోల్, ఆటో-ప్లే వీడియోస్, పర్సనలైజ్డ్ కంటెంట్.. ఇవన్నీ మెదడుని హైజాక్ చేస్తాయి..
ఒకసారి ఫోన్ తీసుకుంటే.. మళ్లీ పక్కన పెట్టాలనిపించదు. ఇదే డిజిటల్ డ్యామేజ్! అని అర్థం చేసుకోవాలి. అధిక స్క్రీన్ టైమ్ ఏకాగ్రతను తగ్గించడంతోపాటు నిద్రనూ దూరంచేస్తుందని మానసిక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. చాలామంది సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూసి తమతో పోల్చుకుంటూ డిప్రెషన్‌కు గురవుతున్నారు. JEE, NEET లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇది మరింత ప్రమాదకరం.
ఏదైనా సాధించాలంటే స్మార్ట్‌ఫోన్ పూర్తిగా వదిలేయాలా? అవసరం లేదు! కానీ స్మార్ట్‌గా వాడాలి. డిజిటల్ వెల్బీయింగ్ అనేది కేవలం స్క్రీన్ టైమ్ తగ్గించడం కాదు.. స్మార్ట్‌గా వాడటం! కొన్ని సింపుల్ రూల్స్ ఫాలో అవ్వండి..
స్మార్ట్‌ఫోన్ కేవలం డిస్ట్రాక్షన్ కాదు.. అది పవర్ఫుల్ ఎడ్యుకేషనల్ టూల్ కూడా! AI- డ్రివెన్ లెర్నింగ్ యాప్స్, ఆన్లైన్ కోర్సెస్, ఎడ్యుకేషనల్ వీడియోస్.. ఇవన్నీ మీ చదువుని ఈజీ చేస్తాయి. కానీ, అది మనం ఫోన్‌ని ఎలా వాడుతున్నాం అనే దాని మీద ఉంటుంది! స్మార్ట్‌ఫోన్‌లో సోషల్ మీడియా యాప్స్ తీసేస్తే.. అది ఒక పవర్ఫుల్ లెర్నింగ్ డివైజ్ అవుతుందని నిపుణుల మాట. Unacademy, BYJU’S, Khan Academy, Coursera లాంటి యాప్స్ విద్యార్థులకు దోహదం చేసేవే! ప్రాబ్లమ్ డివైజ్‌లో లేదు.. యూసేజ్‌లో ఉంది! కోటా టాపర్స్ కూడా ఇదే చేశారు.. డిస్ట్రాక్షన్ని అధిగమించారు.. ఫోకస్‌ను పెంచుకున్నారు!
కోటా వీడియో పై సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి.. కొందరు.. ‘ఇదే డిసిప్లిన్! ఈ వయసులో స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు’ అని ప్రశంసించారు. మరికొందరు.. ‘కోచింగ్ సెంటర్స్ నిబంధనల వల్ల కీప్యాడ్ ఫోన్స్ వాడాల్సి వచ్చింది’ అంటూ స్పందించారు. ఇంకొందరు.. ‘స్మార్ట్‌ఫోన్‌ని సరిగ్గా వాడితే అది టూల్ అవుతుంది.. తప్పుగా వాడితే ట్రాప్ అవుతుంది’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజం ఏంటంటే.. టెక్నాలజీని పూర్తిగా తిరస్కరించడం కాదు.. దానిని స్మార్ట్‌గా వాడటం నేర్చుకోవాలి! మీ పిల్లవాడు JEE, NEET, UPSC లేదా ఏ పరీక్షకైనా ప్రిపేర్ అవుతుంటే.. కొన్నాళ్లపాటు కీప్యాడ్ ఫోన్ వాడటంలో నామోషీ ఏం లేదు. పూర్తిస్థాయిలో చదువు మీద ఫోకస్ చేయాల్సిన తరుణంలో.. స్మార్ట్‌ఫోన్ ట్రాప్‌లో పడితే ప్రమాదమే! డిజిటల్ వెల్బీయింగ్ అంటే… ఫోన్‌ని వదిలేయడం కాదు, ఫోకస్‌ని పెంచుకోవడం!!