ముంబై: ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు కారణమైన మాజీ ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో ఆ మహిళ నుంచి లక్షల్లో డబ్బు అతడు తీసుకున్నట్లు తెలుసుకున్నారు. (Air Hostess Dies By Suicide) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల మహిళ ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తున్నది. 2025 డిసెంబర్ 28న కళ్యాణ్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది.
కాగా, కుమార్తె ఫోన్ తీయకపోవడంతో ఆ మహిళ తల్లి ఆందోళన చెందింది. పొరుగువారిని అలెర్ట్ చేయగా వారు ఆ ఇంటికి వెళ్లి పరిశీంచారు. సీలింగ్‌కు వేలాడుతున్న మహిళను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు తన కుమార్తె ఆత్మహత్యకు 23 ఏళ్ల మాజీ ప్రియుడు కారణమని ఆమె తల్లి ఆరోపించింది. 2020 నుంచి వారిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు తెలిపింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె నుంచి లక్షలు తీసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే ఆ వ్యక్తికి మరో మహిళతో సంబంధం ఏర్పడినట్లు మృతురాలి తల్లి ఆరోపించింది. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన అతడు ఆమె ఫొటోలు బహిరంగపరుస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
కాగా, మృతురాలి మొబైల్ ఫోన్, బ్యాంకు ఖాతాల లావాదేవీలు పరిశీలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్యకు కారణమైన మాజీ ప్రియుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Bangladeshi Women | భారత్‌లోకి తిరిగి ప్రవేశించిన బంగ్లాదేశ్ మహిళలు.. అరెస్ట్
Iran Unrest | ‘ఇరాన్‌ను విడిచి వెళ్లండి, ప్రయాణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి’.. భారత పౌరులకు కీలక సూచన
Cop’s Cook, Driver Turn Witness | పోలీస్ అధికారి డ్రైవర్, వంట మనిషి.. వందకుపైగా కేసుల్లో సాక్షులు
Tej Pratap Yadav | తల్లిదండ్రులు, తమ్ముడ్ని కలిసిన తేజ్ ప్రతాప్ యాదవ్.. ఎందుకంటే?