వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం వేళ బల ప్రయోగం ద్వారా హొర్ముజ్ జల సంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందిస్తూ.. తమకు ఎవరి సాయమూ అవసరం లేదన్నారు. హొర్ముజ్‌లో నౌకల రవాణాను పునరుద్ధరించేందుకు తాము ఒంటరిగానే ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇరాన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తున్న ట్రంప్..మరోవైపు క్యూబాను స్వాధీనం చేసుకోవటంపై దృష్టి సారించారు. ఆ ద్వీప దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు ట్రంప్, తనకు మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.