ముంబై: భారత్ నుంచి బహిష్కరించిన ఇద్దరు బంగ్లాదేశ్ మహిళలు అక్రమంగా దేశంలోకి తిరిగి ప్రవేశించారు. ఆ మహిళల గురించి పోలీసులకు తెలిసింది. దీంతో వారిని అరెస్ట్ చేశారు. తిరిగి భారత్‌లోకి ప్రవేశించేందుకు ఎవరు సహకరించారు అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Bangladeshi Women) గత ఏడాది ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన 38 ఏళ్ల జులేఖా జమాల్ షేక్‌ను ముంబై పోలీసులు బహిష్కరించారు. బంగ్లాదేశ్ అధికారులకు ఆమెను అప్పగించారు.
కాగా, బంగ్లాదేశ్ మహిళ జులేఖా జమాల్ అక్రమ మార్గంలో తిరిగి ముంబై చేరుకున్నది. గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలోని కామాతిపుర ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నివసిస్తున్నది. ఈ సమాచారం తెలుసుకున్న ముంబై పోలీసులు మంగళవారం ఆమెను అరెస్ట్ చేశారు. విదేశీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు బంగ్లాదేశ్‌కు చెందిన 30 ఏళ్ల బిల్కిస్ బేగం సిర్మియా అక్తర్‌ను కూడా గత ఏడాది ఆగస్ట్‌లో భారత్ నుంచి బహిష్కరించారు. అయితే ఆమె కూడా అక్రమ మార్గాల్లో తిరిగి ముంబై చేరుకున్నది. కఫ్ పరేడ్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నది.
ఈ సమాచారం తెలుసుకున్న ముంబై పోలీసులు బిల్కిస్ బేగం ఇంటిపై రైడ్ చేశారు. ఆమె మొబైల్ ఫోన్ పరిశీలించగా బంగ్లాదేశ్ మహిళగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. బీఎన్‌ఎస్‌తోపాటు విదేశీ చట్టం కింద కేసు నమోదు చేశారు. బహిష్కరించిన బంగ్లాదేశ్ మహిళలు తిరిగి భారత్‌లోకి ప్రవేశించేందుకు ఎవరు సహకరించారు అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Iran Unrest | ‘ఇరాన్‌ను విడిచి వెళ్లండి, ప్రయాణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి’.. భారత పౌరులకు కీలక సూచన
Cop’s Cook, Driver Turn Witness | పోలీస్ అధికారి డ్రైవర్, వంట మనిషి.. వందకుపైగా కేసుల్లో సాక్షులు
Tej Pratap Yadav | తల్లిదండ్రులు, తమ్ముడ్ని కలిసిన తేజ్ ప్రతాప్ యాదవ్.. ఎందుకంటే?