టెహ్రాన్: ఇరాన్లో నిరసనలు తీవ్రమయ్యాయి. మరణించిన వారి సంఖ్య 2,500 దాటింటి. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులను తాజాగా హెచ్చరించింది. వీలైనంత త్వరగా ఇరాన్‌ను విడిచి వెళ్లాలని సూచించింది. (Iran Unrest) ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులైన విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారులు, పర్యాటకులు వాణిజ్య విమానాలతో సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా బయలుదేరాలని కోరింది. అలాగే ప్రయాణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఏదైనా సహాయం కోసం భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది.
కాగా, ఇరాన్‌లోని భారత పౌరులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. నిరసనలు లేదా ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. సంప్రదింపుల కోసం అత్యవసర హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది.
మరోవైపు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఇంకా నమోదు చేసుకోని భారతీయ పౌరులు https://www.meaers.com/request/home లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని కోరింది. ఇరాన్లో ఇంటర్నెట్ అంతరాయాల కారణంగా నమోదు చేసుకోలేకపోతే, భారత్‌లోని కుటుంబ సభ్యులు ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.

Embassy Letter
Also Read:
Tej Pratap Yadav | తల్లిదండ్రులు, తమ్ముడ్ని కలిసిన తేజ్ ప్రతాప్ యాదవ్.. ఎందుకంటే?
Cop’s Cook, Driver Turn Witness | పోలీస్ అధికారి డ్రైవర్, వంట మనిషి.. వందకుపైగా కేసుల్లో సాక్షులు
Watch: పోలీస్ వాహనం ముందే బైక్ విన్యాసాలు.. పట్టించుకోని పోలీసులు