Karur Train Accident | ప్రైవేట్ కాలేజీ బస్సును ఢీకొన్న గూడ్స్ రైలు.. ఆరుగురు విద్యార్ధుల పరిస్థితి విషమం..!
Karur Train Accident : తమిళనాడు రాజధాని చెన్నైలోని కరూర్‌లో రైలు ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం ఒక గూడ్స్ రైలు ప్రైవేట్ కాలేజీ బస్సును ఢీకొట్టింది.
Karur Train Accident : తమిళనాడు రాజధాని చెన్నైలోని కరూర్‌లో రైలు ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం ఒక గూడ్స్ రైలు ప్రైవేట్ కాలేజీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్ధుల పరిస్థితి విషమంగా ఉండగా.. 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
కరూర్‌లోని వెల్లియనాయ్ సమీపంలో ప్రైవేట్ బస్సును వేగంగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టింది. బస్సును డ్రైవర్ రైల్వే ట్రాక్‌ను దాటిస్తుండగా.. రైలు ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి.
స్థానిక థంతి టీవీ కథనం ప్రకారం.. గాయపడిన విద్యార్ధులను కరూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. ఒకరిని ఐసీయూలో ఉంచినట్టు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Common Pass | కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక
Sai Dharam Tej | ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం..
Bloody Romeo | గ్యాప్ తీసుకోని నాని..! జెట్ స్పీడ్‌లో బ్లడీ రోమియో
Agniveer Scheme | అగ్నివీరుల పెండ్లి నిబంధనల్లో మార్పు? మినహాయింపు ఇచ్చే అవకాశం
Supreme Court | అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే ‘24 గంటల గడువు’.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

