బీఆర్ఎస్తోనే మైనార్టీల అభ్యున్నతి
ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని, బీఆర్ఎస్ పాలనలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా బొల్లారం డివిజన్ పరిధిలో మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు హరీశ్‌రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
- పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు
- బొల్లారంలో మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
- హాజరైన హరీశ్‌రావు, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
- భారీ బైక్ ర్యాలీతో హరీశ్‌రావుకు స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు
బొల్లారం, మార్చి 15: ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని, బీఆర్ఎస్ పాలనలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా బొల్లారం డివిజన్ పరిధిలో మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు హరీశ్‌రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా ముస్లింలతో కలిసి హరీశ్‌రావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ… తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మైనార్టీల విద్యాభివృద్ధికి గురుకులాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులకు ఉచిత విద్య అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దకిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు చేసిందేమీ లేదన్నారు. ముస్లిం సబ్‌ప్లాన్ ఏమైందని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చిందని అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని, కానీ..ఇప్పటి వరకు ఎలాంటి ఎమ్మెల్సీ పదవి ముస్లింలకు రేవంత్ సర్కార్ ఇవ్వలేదని విమర్శించారు. సందర్భంగా హరీశ్‌రావును, గూడెం మహిపాల్‌రెడ్డిని, శంభీపూర్ రాజును ముస్లిం మత పెద్దలు, మైనార్టీలు, మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రవీందర్ రెడ్డి, దేవానంద్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- BRS
- harish rao
- Iftar dinner
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

