లక్నో: ఆడుకుంటుండగా బాలిక కాలువలో పడింది. ఆమె దుస్తులు మురికి కావడంపై తండ్రి, సవతి తల్లి ఆగ్రహించారు. ఆ చిన్నారిని దారుణంగా కొట్టారు. రాత్రంతా టెర్రస్‌పై చలిలో వదిలేశారు. ఆ బాలిక మరణించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. (Daughter Beaten To Death) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. జనవరి 11న ఆరేళ్ల షిఫా తోటి పిల్లలతో కలిసి ఇంటి బయట వీధిలో ఆడింది. అయితే ప్రమాదవశత్తు డ్రైనేజీలో పడింది. దీంతో ఆ బాలిక దుస్తులకు మట్టి అంటుకోవడంతో మురికిమయంగా మారాయి.
కాగా, షిఫా మురికి దుస్తులు చూసి తండ్రి అక్రమ్, సవతి తల్లి నిషా ఆగ్రహించారు. ఆ బాలికను దారుణంగా కొట్టారు. రాత్రంతా చలిలో టెర్రస్‌పై వదిలేయడంతో ఆ చిన్నారి మరణించింది. సోమవారం ఉదయం స్థానికులకు ఇది తెలిసింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆ చిన్నారి ఎముకలు విరుగడం, రక్తం గడ్డకట్టంతోపాటు శరీరంపై 13 గాయాలున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. మరణించిన మొదటి భార్య సంతానమైన ఆ బాలికను కొట్టి చంపిన తండ్రి అక్రమ్, సవతి తల్లి నిషాను బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Air Hostess Dies By Suicide | ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య.. మాజీ ప్రియుడిపై కేసు
Bangladeshi Women | భారత్‌లోకి తిరిగి ప్రవేశించిన బంగ్లాదేశ్ మహిళలు.. అరెస్ట్
Bhagwant Mann | పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బ్రిటన్ పర్యటనకు అనుమతి నిరాకరణ.. కేంద్రంపై ఆప్ ఆరోపణ