Dhurandar | ప్రస్తుతం ఇండియా వైడ్‌గా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో “దురంధర్ 2” ఒకటి. టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా, టాలెంటెడ్ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో కూడా అద్భుతమైన బుకింగ్స్ నమోదు చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తోంది. ధురంధర్” మొదటి భాగం మంచి విజయాన్ని అందుకోవడంతో దాని సీక్వెల్ అయిన “ధురంధర్ 2”పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ దర్శకత్వం కలిసిరావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పటికే ట్రైలర్, టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ కూడా ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ని తెలియజేస్తుంది. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతుండడంతో ఈ చిత్రం సీక్వెల్స్‌లో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి భారీ హైప్ మధ్య ఇప్పుడు మరో క్రేజీ వార్త బయటకు వచ్చింది. దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పటికే “ధురంధర్ 3 పనులు కూడా మొదలుపెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. “ధురంధర్ 2”పై వస్తున్న స్పందనను చూసి కథను మరింత విస్తరించేలా మూడో భాగం కూడా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం “ధురంధర్ 3”కు సంబంధించిన స్క్రిప్ట్ డెవలప్మెంట్ దశలో ఉందని తెలుస్తోంది. అయితే ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. “ధురంధర్ 2” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం మూడో భాగాన్ని కూడా భారీ స్థాయిలో తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్, సోషల్ మీడియా ట్రెండ్లు చూస్తుంటే “ధురంధర్ 2”కు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే “ధురంధర్” ఫ్రాంచైజ్ మరింత పెద్ద సిరీస్‌గా మారే అవకాశం కూడా ఉంది. మరి ఈ భారీ అంచనాల మధ్య విడుదల కానున్న “ధురంధర్ 2” ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది, నిజంగానే “ధురంధర్ 3” కూడా వస్తుందా లేదా అనేది చూడాలి.