Harish Rao | లాగ్‌బుక్స్ మాయం.. ప్రజా సమస్యలు వదిలేసి మా పొలాల దగ్గర తిరుగుతున్నారు : హరీశ్ రావు
Harish Rao | ప్రజల సమస్యల గురించి మేము నిలదీస్తే మీరు న్యాయబద్ధంగా కొనుక్కున్న మా ఆస్తుల దగ్గరికి వెళ్తే ఏం లాభం..? మీరు ఎన్ని డైవర్షన్ డ్రామాలు చేసినా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హెచ్చరించారు.
Harish Rao | తాను సబ్ స్టేషన్ సందర్శనకు వస్తున్నానని లాగ్ బుక్స్ మాయం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. మోటకొండూర్ పర్యటనలో భాగంగా అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని సందర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాధారణంగా ఎప్పుడైనా సబ్‌స్టేషన్‌లో ఎప్పుడైనా లాగ్ బుక్స్ ఉంటాయి. ఎప్పుడు కరెంట్ వచ్చింది.. ఎప్పుడు 3 ఫేజ్ కరెంట్ తీసేశారు. మధ్యలో ఎన్నిసార్లు ట్రిప్ అయ్యింది.. నెట్టుగా 3ఫేజ్ కరెంట్ రైతులకు ఎన్ని గంటలు ఇచ్చారనేది లాగ్ బుక్స్‌లో నమోదు చేయడం విద్యుత్ ఉద్యోగుల పద్దతి, ఆనవాయితీ. కరెంట్ ఎన్ని గంటలు వస్తుందో చూద్దామని సబ్‌స్టేషన్‌కు వచ్చాం. 6-7 గంటలు కూడా కరెంట్ వస్తలేదు.. బాగా ఇబ్బంది అవుతుందని మోటకొండూర్ రైతులు చెప్పింది మీరు కూడా చూశారన్నారు.
మోటకొండూరు రైతులు కనీసం 7 గంటల కరెంట్ కూడా రావడంలేదని చెప్తే, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సబ్ స్టేషన్ సందర్శనకు వచ్చాము. ఇక్కడి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి ప్రజా సమస్యలను వదిలేసి మా పొలాల దగ్గర తిరుగుతున్నారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
బఫర్ జోన్లలో కట్టిన కాంగ్రెస్ నాయకుల ఫాంహౌసుల వద్దకు కూడా మీరు వెళ్లి పరిశీలించారా.. ? అని ప్రశ్నించారు. ప్రజల సమస్యల గురించి మేము నిలదీస్తే మీరు న్యాయబద్ధంగా కొనుక్కున్న మా ఆస్తుల దగ్గరికి వెళ్తే ఏం లాభం..? మీరు ఎన్ని డైవర్షన్ డ్రామాలు చేసినా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామని హరీశ్ రావు హెచ్చరించారు.
నేను సబ్ స్టేషన్ సందర్శనకు వస్తున్నానని లాగ్ బుక్స్ మాయం చేశారు
మోటకొండూరు రైతులు కనీసం 7 గంటల కరెంట్ కూడా రావడంలేదని చెప్తే, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సబ్ స్టేషన్ సందర్శనకు వచ్చాము
ఇక్కడి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి ప్రజా సమస్యలను… https://t.co/2ay9Y7ElT4 pic.twitter.com/1VXuqgGHYw
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2026
Read Also :
ATMs | కరీంనగర్లో ఏటీఎంలలో దొంగలు హల్చల్ : వీడియో
Nabha Natesh | సైమా వేడుకల్లో మెరూన్ గౌన్‌లో మెరిసిన నభా నటేష్.. ఫొటోలు వైరల్!
Watch: ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న కుమార్తెను ఆమె కుటుంబం కిడ్నాప్.. తర్వాత ఏం జరిగిందంటే..?
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

