చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) వచ్చే నెలలో పెట్టుబడుల కోసం బ్రిటన్, ఇజ్రాయెల్ పర్యటించాల్సి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. గతంలో కూడా భగవంత్ మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం ఆమోదం తెలుపలేదని విమర్శించింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్ అరోరా, ఇతర అధికారులు ఫిబ్రవరిలో యూకే, ఇజ్రాయెల్‌కు వెళ్లాల్సి ఉన్నదని ఆప్ తెలిపింది.
కాగా, పంజాబ్‌కు పెట్టుబడులు ఆకర్షించడానికి సీఎం భగవంత్ మాన్ తలపెట్టిన వారం రోజుల విదేశీ పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజకీయ అనుమతి నిరాకరించినట్లు పంజాబ్ ఆప్ ప్రధాన కార్యదర్శి, పార్టీ మీడియా ఇన్ఛార్జ్ బల్తేజ్ పన్ను ఆరోపించారు. దీనికి కారణాన్ని కూడా కేంద్రం వెల్లడించలేదని విమర్శించారు.
మరోవైపు గత ఏడాది ఆగస్ట్ 4న భారత హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కోసం భగవంత్ మాన్ పారిస్ వెళ్లాలని భావించారు. అయితే అప్పుడు కూడా కేంద్రం రాజకీయ అనుమతి నిరాకరించినట్లు ఆప్ మండిపడింది.
Also Read:
Tej Pratap Yadav | తల్లిదండ్రులు, తమ్ముడ్ని కలిసిన తేజ్ ప్రతాప్ యాదవ్.. ఎందుకంటే?
Air Hostess Dies By Suicide | ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య.. మాజీ ప్రియుడిపై కేసు
Bangladeshi Women | భారత్‌లోకి తిరిగి ప్రవేశించిన బంగ్లాదేశ్ మహిళలు.. అరెస్ట్
Cop’s Cook, Driver Turn Witness | పోలీస్ అధికారి డ్రైవర్, వంట మనిషి.. వందకుపైగా కేసుల్లో సాక్షులు