– చందంపేట కేజీబీవీలో అదనపు తరగతి గదులు ప్రారంభం
చందంపేట, మార్చి 13 : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కష్టపడి చదివి మంచి భవిష్యత్ పొందాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. శుక్రవారం చందంపేట, మురుపునతుల, బంధమీద్ తండా, మానవత్ తండాలో పలు అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో రూ.85 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. అదే విధంగా అయా గ్రామాల్లో సంఘం భవనం, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కలిపిస్తూ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఏడీఏ బాలు, ఎంపీడీఓ లక్ష్మి, ఎంఈఓ లింగమయ్య, సర్పంచులు సాదిక్, మన్మథరెడ్డి, కవిత రవి, వెంకటయ్య, బిక్కు నాయక్, కృష్ణ, గోవింద్ యాదవ్, హరికృష్ణ, బాధ్యనాయక్, గిరి, మల్లారెడ్డి, రంగయ్య, మకట్ లాల్, నాగేశ్వర్ నాయక్, రాజు, జ్యోతి పాల్గొన్నారు.