OTT Movies | శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రియులకు పండుగే. థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తే.. ఓటీటీ వేదికలపై కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతాయి. ఈ వారం కూడా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలకు చెందిన పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ ప్రారంభించాయి. మరి ఈ వారాంతంలో ఏయే సినిమాలు, సిరీస్‌లు చూడొచ్చో తెలుసుకుందాం.
‘రావు బహదూర్’ నెట్‌ఫ్లిక్స్‌లో
సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సైకాలజికల్ డ్రామా ‘రావు బహదూర్’ ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వెంకటేశ్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
‘బాలన్ ది బాయ్’ జీ5లో
‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ‘బాలన్ ది బాయ్’ కూడా ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సైకాలజికల్ డ్రామా ప్రస్తుతం జీ5లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.
శ్రీకాంత్ తొలి ఓటీటీ సిరీస్
సీనియర్ నటుడు శ్రీకాంత్, ముఖేష్ రిషి ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్‌రూమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’ కూడా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. లీగల్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు.
ఆహాలో ‘దీవానా’
హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘దీవానా’ ఆహా వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ వంగిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలతో రూపొందింది.
నెట్‌ఫ్లిక్స్..
రావు బహదూర్
గట్ట కుస్తీ (తెలుగు డబ్బింగ్)
మలైకట్ మలమ్
మ్యాన్ ఆఫ్ విర్చు
ది వికేషన్ ప్రిన్సిపుల్
అమెజాన్ ప్రైమ్ వీడియో
లవ్ ఓ లవ్
బ్యాట్ మన్ సీజన్ 2
జీ5
బాలన్ ది బాయ్
అబ్జెక్షన్ మై లార్డ్
హై జవానీ తోనా ఇష్క్ హోనా హై
వంద దేవుళ్లు
భువనం గగనం
జియో హాట్ స్టార్
హార్ట్ బీట్ సీజన్ 2
చిన్న చిన్న ఆశై
సన్ నెక్స్ట్
డీసీ రవే
పైతలట్టమ్ (మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్)
సోని లివ్
ది లెజెండ్ ఆఫ్ కర్ణ
లయన్స్ గేట్ ప్లే
చుమ్ (తెలుగు డబ్బింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్)
ఈ వారం ఓటీటీలో యాక్షన్, రొమాన్స్, సైకాలజికల్ డ్రామా, కోర్ట్‌రూమ్ థ్రిల్లర్, హారర్ వంటి విభిన్న జానర్లలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీకెండ్‌ను ఎంటర్టైనింగ్గా గడపాలనుకునే సినీ ప్రియులకు ఇవి మంచి ఛాయిస్‌గా నిలవనున్నాయి.