Migrants Crossings: స్పెయిన్‌లోకి వేల సంఖ్యలో మొరాక్కో శరణార్థుల చొరబాటు.. సియుటా బోర్డర్ వద్ద 9 మంది మృతి
Migrants Crossings: వేల సంఖ్యలో మొరాక్కో శరణార్థులు బోర్డర్ వద్ద స్పెయిన్‌లోకి ప్రవేశిస్తున్నారు. మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ సముద్రాన్ని కలిపే సియుట ప్రాంతం వద్ద శరణార్ధులు కిక్కిరిసిపోయారు. బోర్డర్ దాటే క్రమంలో సుమారు 9 మంది మృతిచెందారు.
సియుటా: మొరాక్కో బోర్డర్ వద్ద వేల సంఖ్యలో శరణార్థులు(Migrants Crossings).. స్పెయిన్‌లోకి ప్రవేశిస్తున్నారు. మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ సముద్రాన్ని కలిపే సియుట ప్రాంతం వద్ద శరణార్ధులు కిక్కిరిసిపోయారు. ఆఫ్రికా నుంచి యూరోప్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకుంటున్నారు. అయితే సియుటా వద్ద గురువారం వేల సంఖ్యలో జనం స్పెయిన్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ ఘటనలో సుమారు 9 మంది మృతిచెందారు. అక్కడ గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్ తన మిలిటరీని సియుటాలో మోహరించేందుకు సిద్దమైంది.
బోర్డర్ సమస్యను పరిష్కరించేందుకు బలగాలను మోహరించాలని మాడ్రిడ్‌ను సియుటా కోరడంతో ఒక్కసారిగా వేల సంఖ్యలో శరణార్థులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బోర్డర్ ఫెన్సింగ్‌ను దాటి వెళ్లే ప్రయత్నం చేశారు. సియుటాలో సెక్యూర్టీని మెయిన్టేన్ చేసేందుకు సివిల్ గార్డ్లను పంపనున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం సియుటాలో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచేజ్, హోంశాఖ మంత్రి గ్రాండే మర్లస్కా పర్యటించనున్నారు. సియుటా వద్ద ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొన్నదని, శరణార్థుల సంఖ్యను కచ్చితంగా చెప్పలేమని, కానీ వేల సంఖ్యలో శరణార్ధులు సరిహద్దు దాటుతున్నారని, బోర్డర్ వ్యవస్థ కుప్పకూలినట్లు స్పెయిన్ సివిల్ గార్డ్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు.
తారాజల్ బోర్డర్‌ను తెరవడంతో.. భారీ సంఖ్యలో జనం బోర్డర్‌ను దాటినట్లు మొరాక్కో మానవ హక్కుల సంఘం సభ్యుడు అచ్రాఫ్ మియామౌనీ తెలిపారు. వేల సంఖ్యలో మొరాకో ప్రజలు తారాజల్ బీచ్ దాటుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. యువతతో పాటు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
The INVASION of Spain is unfolding right before our eyes 🇪🇸🚨
Prime Minister Pedro Sanchez’s government policies are actively encouraging massive waves of migration from Africa into Spain.
The Spanish territory of Ceuta – an enclave bordering Morocco near the Strait of… pic.twitter.com/w8i0JR04yR
— Predictivemoney (@Predictivemoney) July 30, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

