Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా లాస్.. కారణాలు ఇవే..!
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనం చవిచూస్తున్నాయి. ఇవాళ (గురువారం) ఉదయం నుంచే భారతీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాన సూచీల్లో పతనం కనిపించింది. అదే పతనం మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే ఉన్నది.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) భారీ పతనం చవిచూస్తున్నాయి. ఇవాళ (గురువారం) ఉదయం నుంచే భారతీయ ఈక్విటీ మార్కెట్లు (India Equity Markets) తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాన సూచీల్లో పతనం కనిపించింది. అదే పతనం మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే ఉన్నది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1150 పాయింట్లకుపైగా నష్టంతో 73,677 వద్ద కొనసాగుతున్నది.
అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 371 పాయింట్లకుపైగా నష్టంతో 23,250 స్థాయికంటే దిగువకు చేరింది. ఈ రోజు మార్కెట్లో కనిపిస్తున్న నష్టాలకు ప్రధానంగా ఐదు కారణాలున్నాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్ భారీగా పెరగడం, యూఎస్ 10-సంవత్సరాల బాండ్ రాబడులు 5.11% స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి సెక్యూర్డ్ బాండ్లవైపు నిధులను మళ్లించారు. ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం, అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలలో అనిశ్చితి నెలకొనడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 102.5 డాలర్లు దాటింది.
ఇది భారత దిగుమతి బిల్లును, ద్రవ్యోల్బణ భయాలను పెంచుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీనత, రాత్రిపూట వాల్స్ట్రీట్లో టెక్ షేర్లతో సహా డౌ జోన్స్, నాస్డాక్లలో నష్టాలు నమోదుకావడంతో ఆసియా మార్కెట్లు ఉదయమే 0.6 శాతం క్షీణించి ప్రతికూల సంకేతాలను ఇచ్చాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాల ఆందోళనలు, గ్లోబల్ వడ్డీ రేట్లు దీర్ఘకాలం గరిష్ఠ స్థాయిల్లోనే ఉంటాయనే అంచనాలతో విదేశీ ఫండ్స్ భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నాయి.
బీమారంగ స్టాక్స్పై ఆర్డీఏఐ నిబంధనల ప్రభావం.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బాడీ కమిషన్ నిబంధనలు, చెల్లింపులపై పరిమితులు, ఏజెంట్ల ఖర్చులపై కొత్త ప్రతిపాదనలు తేవడంతో హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ వంటి ప్రధాన బీమా కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ తీవ్ర ఒత్తిడి మధ్య, బీఎస్ఈలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఐపీవో షేర్లు రూ.1,800 వద్ద 0.84% స్వల్ప ప్రీమియంతో లిస్ట్ కావడంతో ఇన్వెస్టర్ల దృష్టి దానిపై పడింది. అయితే చమురు ధరల ముప్పు, గ్లోబల్ బాండ్ మార్కెట్ ఒత్తిడి కారణంగా రోజంతా సూచీలు అమ్మకాల ఒత్తిడిలోనే కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

