Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Pocket Rockets | మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న కొత్త సినిమా ‘పాకెట్ రాకెట్స్’పై టాలీవుడ్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు మాక్సిమం సిటీ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న కొత్త సినిమా ‘పాకెట్ రాకెట్స్’పై టాలీవుడ్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు మాక్సిమం సిటీ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ నుంచి మేకర్స్ తాజాగా ‘ది ఫస్ట్ హ్యాండ్’ పేరుతో టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతోంది.
శ్రీలంకలోని సుందరమైన రిసార్ట్‌లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఓ యువకుడు ‘ఈ ఫీలింగ్ ఏంట్రా ఇలా ఉంది.. కల కంటే రియాలీనే ఫస్ట్ టైమ్ బావుంది’ అని అనడంతో టీజర్ ఆసక్తికరంగా మారుతుంది. వెంటనే మరో పాత్ర స్పందిస్తూ.. ‘డోంట్ టాక్ టు మీ తెలుగు లైక్ లోకల్ బస్తీ గైస్.. ఐ యామ్ ది ఓనర్ ఆఫ్..’ అంటూ చెప్పే డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
ఈ చిత్రంలో బస్తీలో ఉండే ఇద్దరు కుర్రాళ్లు చదువుకుంటూ, తమ జీవితాలను బాగుపరచుకోవడానికి పడే కష్టాలను ప్రధానంగా చూపించబోతున్నారు. వారి జీవితంలోకి ఓ అందమైన అమ్మాయి ఎంట్రీ ఇవ్వడం, ఆమె వీరిని శ్రీలంకకు పంపించడం, అక్కడ గ్యాబ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం వంటి పరిణామాలు కథలో కీలక మలుపులుగా మారుతాయి. విదేశాల్లో చదువుకోవాలనే కల కోసం గ్యాబ్లింగ్‌ను ఆశ్రయించే కుర్రాడిగా, జేడీ చక్రవర్తి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో, ‘శుభం’ ఫేమ్ శ్రియా కొంతం హీరోయిన్గా అలరించనుంది. అలాగే ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తితో పాటు శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎదురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా, గ్యానీ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
టీజర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ మాట్లాడుతూ సినిమాపై తమకున్న నమ్మకాన్ని వ్యక్తపరిచింది. ‘నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ని చూడలేదు’ అంటూ జేడీ చక్రవర్తి ప్రశంసించారు. నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 11న రాబోతున్న ‘పాకెట్ రాకెట్స్’తో మేమంతా మీ సోషల్ మీడియాలోకి, మీ ఇంట్లోకి వచ్చేస్తాం’ అని తెలిపారు. పాకెట్లో ఉండే స్మార్ట్‌ఫోన్ తీసి పక్కన పెట్టేసి, రెండు గంటల పాటు నవ్వుకుంటూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

