ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Tharun Bhascker | తెలుగు సినీ పరిశ్రమలో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుని, ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat) చిత్రంపై అంచనాలు రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుని, ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat) చిత్రంపై అంచనాలు రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. వివేక్, కౌశిక్, ఉప్పు, కార్తీక్ గ్యాంగ్ మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుండటంతో సినిమా ప్రియులు పండగ చేసుకుంటున్నారు. నవంబర్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.
మొదటి పార్ట్ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ఈ సీక్వెల్ కథ మొదలవుతుంది. వివేక్, తన స్నేహితుల గ్యాంగ్‌తో కలిసి ఒక వైల్డ్ సర్వైవల్ ఫిల్మ్ తీయడానికి బయలుదేరుతాడు. ఈ ప్రయాణంలో ఆ గ్యాంగ్‌కు వరుసగా ఎన్నో క్రేజీ, ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. గందరగోళం, ఉత్సాహంతో నిండిన ఒక ఎంటర్టైనింగ్ జర్నీని ఈ సినిమా అందించబోతోందనే స్పష్టమైన హింట్‌ను ట్రైలర్ ఇస్తోంది. ఫన్, మ్యాడ్నెస్, థ్రిల్స్‌తో పాటు తరుణ్ భాస్కర్ మార్క్ క్విర్కీ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాలో అందరికీ ఎంతో ఇష్టమైన ENE గ్యాంగ్ తిరిగి రావడం బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలవనుంది. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్, కౌశిక్‌గా అభినవ్ గోమఠం, ఉప్పుగా వెంకటేష్ కాకుమాను, కార్తీక్‌గా శ్రీనాథ్ మాగంటి మరోసారి కనిపించనున్నారు. ఒరిజినల్ క్యారెక్టర్స్ అన్నీ మళ్లీ ఒక్కచోట చేరి తమ మధ్య ఉన్న స్నేహాన్ని, కామెడీని తెరపై పంచుకోవడం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ ట్రైలర్లో అనీషా అంబ్రోస్ కూడా కనిపించగా, సీక్వెల్లో మరింత ఆసక్తిని పెంచేందుకు శివాత్మిక రాజశేఖర్, ప్రియదర్శిని రామ్ వంటి కొత్త పాత్రలను కూడా పరిచయం చేస్తున్నారు. వీరి చేరిక కథకు మరింత కొత్తదనాన్ని తెచ్చిపెడుతోంది. టెక్నికల్ పరంగా సినిమాటోగ్రాఫర్ ఏజే ఆరోన్ విజువల్స్ అద్భుతంగా ఉండగా, సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు తరుణ్ భాస్కర్ ధాస్యం మాట్లాడుతూ.. పెళ్లి చూపులు విజయం తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు, తన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తన చుట్టూ నలుగురు స్నేహితులు నన్ను అంటిపెట్టుకుని ఉండేవారని, అలాంటి ఫ్రెండ్షిప్ గురించి సినిమా చేస్తే బాగుంటుందని చేసిన సినిమానే ‘ఈ నగరానికి ఏమైంది’ అని తెలిపారు. ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నప్పుడు కూడా తమ కాంపిటీషన్ మళ్లీ ఆడియన్సేనని, ప్రేక్షకుల అంచనాల గురించే తనకు భయం ఉందన్నారు. ఈ నగరానికి ఏమైంది సినిమాకు ఒక ఎపిక్ వెర్షన్‌లా ఉండాలని ఈ ట్రైలర్‌ను రూపొందించామని, చాలా మంచి పాజిటివ్ ఎనర్జీతో చేసిన ఈ సినిమా అందరికీ ఆ ఎనర్జీని పంచుతుందని చెప్పారు. ప్రేక్షకులందరూ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా థియేటర్లకు వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారని, ఎక్కడికి వెళ్లినా ‘ఈ నగరానికి ఏమైంది 2’ ఎప్పుడు వస్తుందని అడుగుతుండేవారని, మీ అందరికీ ఆ ప్రేమను తిరిగి ఇవ్వడానికి వచ్చానని, సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నానని స్పష్టం చేశారు.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. టైమ్ ఎంత బాగుందంటే స్క్రీన్ నంబర్ 2లో తన సినిమా నడుస్తుంటే, స్క్రీన్ నంబర్ 4లో తన నెక్స్ట్ సినిమా ట్రైలర్ లాంచ్ అవుతోందని, ఈ ట్రైలర్ చూసినప్పుడు నిజంగా ఒక అద్భుతంలా అనిపించిందని తెలిపారు. నవంబర్ 19న చాలా గర్వంగా వరల్డ్ వైడ్ రిలీజ్ అని చెప్పుకునే సినిమా ఇదని, తరుణ్ ప్రాణం పెట్టి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశారని కొనియాడారు. మీరందరూ నవ్వుతారు, ఆనందంతో ఏడుస్తారని, సినిమాలో చాలా జరుగుతాయని, మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.
శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాన్‌స్టాప్‌గా గూస్బంప్స్ వస్తూనే ఉన్నాయని, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా చూసినప్పుడు ఒక నటుడిగా కచ్చితంగా ఇలాంటి సినిమాల్లో భాగం కావాలనిపించిందని, ఇందులో భాగం కావడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టిందని చెప్పారు. కచ్చితంగా ఇది ఒక మంచి ఫన్ రైడ్ అని, ఈ సినిమా కోసం తనను రిఫర్ చేసిన విశ్వక్ గారికి, తనను ఎంతగానో నమ్మిన తరుణ్ భాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. ఈ సినిమాను అందరి ప్రేమ కోసం చేశామని, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా ఆ తర్వాత ఎంతగానో అభిమానించారని, ఆ ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నగరానికి ఏమైంది ఫ్యాన్స్‌ను మరొకసారి మెప్పించడం అంత ఈజీ కాదని, తరుణ్ చాలా అద్భుతమైన, నిజాయితీతో కూడిన కథ రాశారని, మీ అందరి ఎదురుచూపులకు తగిన సినిమా వస్తోందని అన్నారు.
వెంకటేష్ కాకుమాను మాట్లాడుతూ.. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు ప్రేక్షకులు చూపించిన ప్రేమతోనే అదే ఇంటెన్షన్‌తో ఇప్పుడు ఈ సినిమాకు పని చేశానని, మరొకసారి అందరితో కలిసి నటించడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని తెలిపారు. అనిషా మాట్లాడుతూ, సినిమా అనేది ఒక ఎమోషన్ అని, ఈ నగరానికి ఏమైంది కూడా ఒక ఎమోషన్ క్రియేట్ చేసిందని, ఈ పార్ట్ 2 కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పారు.
శివాత్మిక మాట్లాడుతూ.. తరుణ్ భాస్కర్‌కు తాను అభిమానినని, తనకు ఆ సినిమా అంటే చాలా ఇష్టమని, ఇప్పుడు పార్ట్ 2లో ఉండటం చాలా హ్యాపీగా ఉందని అన్నారు. నిర్మాత సృజన్ మాట్లాడుతూ, ట్రైలర్ అందరికీ నచ్చడం చాలా హ్యాపీగా ఉందని, ఈసారి ఫ్రెండ్స్ అందరితో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేసిన తర్వాత పేరెంట్స్‌ను కూడా థియేటర్స్‌కు తీసుకొస్తారని, ఇది తరుణ్ భాస్కర్ సినిమాకి ఫ్రెండ్షిప్ రాసిన ఒక లవ్ లెటర్ అని గ్యారెంటీ ఇచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

