Bala Krishna | అల్లు శిరీష్ దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు.. దేవాన్ష్ ధోతి వేడుకలో బాలయ్య సందడి
Bala Krishna | అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రేయసి నయనిక రెడ్డితో కలిసి ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మార్చి 6న హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Bala Krishna | అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రేయసి నయనిక రెడ్డితో కలిసి ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మార్చి 6న హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే వివాహానికి హాజరు కాలేకపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు. అల్లు శిరీష్ – నయనికలకు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులు చంద్రబాబును శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అనంతరం కొద్దిసేపు పరస్పరం మాట్లాడుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో పెళ్లికి హాజరుకాలేకపోయానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు కుటుంబంతో కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు శనివారం సాయంత్రం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ ధోతీ వేడుక కూడా జరిగింది. నారా లోకేష్ – బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్ ఈ నెల 21న 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగుపెట్టనున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో సంప్రదాయబద్ధంగా ధోతీ ఫంక్షన్ నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ – వసుంధర దంపతులు, వారి కుమారుడు మోక్షజ్ఞ తేజ, కుమార్తె తేజస్విని హాజరయ్యారు. నారా – నందమూరి కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక సాదాసీదాగా జరిగింది. బాలకృష్ణ – వసుంధర దేవాన్ష్‌కు కొత్త బట్టలు అందజేసి ఆశీర్వదించారు. ఇక ఈ కార్యక్రమంలో మోక్షజ్ఞ తేజ కనిపించడంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతని లుక్ చూసి త్వరలోనే హీరోగా వెండితెరకు పరిచయం కావాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్లు చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలకృష్ణ – మోక్షజ్ఞ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందన్న వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి.
నూతన దంపతులు అల్లు శిరీష్ – నైనికలను ఆశీర్వదించిన ఏపీ సీఎం చంద్రబాబు.#AlluSirish h #Nainika #ChandrababuNaidu #AlluAravind #Politics #TDP #TDPTwitter pic.twitter.com/zhLwNTgJLG
— Madhuri Daksha (@MadhuriDaksha) March 14, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

