Puvvada Ajaykumar | నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి పువ్వాడ
Puvvada ajaykumar | జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగులంతా నిరుత్సాహంతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. నోటిఫికేషన్లు వేయడం లేదని నిరుత్సాహంతో, ఫ్రస్టేషన్‌తో ఉన్న యువత ఒత్తిడిలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ల ప్రాణాల మీదికి తెచ్కుకుంటున్నారన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
Puvvada ajaykumar | ఖమ్మం : అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి తదితర హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు వేణును ఆస్పత్రిలో పరామర్శించిన ఆయన, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యువకుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
అనంతరం మీడియాతో పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగులంతా నిరుత్సాహంతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. నోటిఫికేషన్లు వేయడం లేదని నిరుత్సాహంతో, ఫ్రస్టేషన్‌తో ఉన్న యువత ఒత్తిడిలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ల ప్రాణాల మీదికి తెచ్కుకుంటున్నారన్నారు. నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, వారి న్యాయమైన హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.


Read Also :
క్షమించడం కాదు.. క్షమాపణ కోరాలి.. మోదీ వీడియోపై నెటిజన్ల అసంతృప్తి
Flight Crash | ఘోరం.. కుప్పకూలిన టూరిస్ట్ విమానం.. 13 మంది దుర్మరణం
Sandeep Reddy Vanga | ఇది ‘రామ్ యుగ్’ ఆరంభం.. ‘రామాయణ’ ట్రైలర్‌పై సందీప్ రెడ్డి వంగా పోస్ట్
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

