Cm Vijay | సీఎం విజయ్‌కు టీవీకే కలర్ రేసింగ్ సూట్ బహుమతిగా ఇచ్చిన అజిత్ కుమార్!
Ajith Kumar Surprises TVK Chief Vijay | తమిళ సినీ పరిశ్రమలో అరుదైన కలయిక జరిగింది. తమిళనాడు సీఎం, అగ్ర కథానాయకుడు విజయ్ కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ (ఏకే)ల మధ్య నెలకొన్న స్నేహభావం ఇరువర్గాల అభిమానుల్లోనూ ఉత్సాహాన్ని నింపింది.
Ajith Kumar Surprises TVK Chief Vijay | తమిళ సినీ పరిశ్రమలో అరుదైన కలయిక జరిగింది. తమిళనాడు సీఎం, అగ్ర కథానాయకుడు విజయ్ కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ (ఏకే)ల మధ్య నెలకొన్న స్నేహభావం ఇరువర్గాల అభిమానుల్లోనూ ఉత్సాహాన్ని నింపింది. శనివారం బ్రిటన్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్లో రేసింగ్ అనంతరం అజిత్ కుమార్, విజయ్ను ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా విజయ్‌కి ‘టీవీకే’ (TVK) పార్టీ రంగులను పోలిన ప్రత్యేకమైన రేసింగ్ సూట్‌ను అజిత్ బహుమతిగా అందించారు. ఈ అనూహ్య బహుమతి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఒక మధురమైన సర్ప్రైజ్గా నిలిచింది.
కేవలం బహుమతితో సరిపెట్టకుండా, రేసింగ్ పట్ల మక్కువ ఉన్న అజిత్… విజయ్‌తో కలిసి సిల్వర్‌స్టోన్ ట్రాక్‌పై స్వయంగా కారులో నాలుగు లాప్లు చక్కర్లు కొట్టారు. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు దిగ్గజ స్టార్లు ఇలా ఒకే వేదికపై, అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో కనిపిచడం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద పోటీదారులుగా ఉన్నప్పటికీ, నిజ జీవితంలో వీరిద్దరూ చూపిన ఈ ఆప్యాయత ఇరు వర్గాల అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో ఈ అరుదైన క్షణాలకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
Breaking: Yesterday, #Ajith gifted @CMOTamilnadu @TVKVijayHQ a #TVK-coloured racing suit. It was a lovely surprise for the TN CM.
AK also drove four laps with the CM at the #Silverstone circuit.
Beautiful camaraderie between the two superstars of Tamil cinema. What a moving… pic.twitter.com/W0SayDyQmR
— Rajasekar (@sekartweets) September 13, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

