Flight Crash : పెరూ (Peru) లో ఘోర విమాన ప్రమాదం (Flight Crash) జరిగింది. పర్యాటకులతో వెళుతున్న టూరిస్ట్ విమానం (Tourist Flight) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పెరూలోని నజ్కా మున్సిపాలిటీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నజ్కా మున్సిపల్ గవర్నమెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పెరూవియన్ కంపెనీ (Peruvian Company) కి చెందిన ఎరోడియానా టూరిస్ట్ విమానం 11 మంది టూరిస్టులు, ఇద్దరు విమాన సిబ్బందితో ఇకా ప్రాంతం నుంచి బయలుదేరింది.
నజ్కా సిటీ బయట ఆ విమానం ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా కిందకు జారుతూ నేలపై పడి పేలిపోయింది. దాంతో విమానంలోని 13 మంది సజీవ దహనమయ్యారు. చనిపోయిన 11 మంది టూరిస్టులలో ఇద్దరు జర్మన్లు, ఇద్దరు స్పానిష్, ఏడుగురు ఇటాలియన్ వ్యక్తులు ఉన్నారు. ప్రమాదానికిగల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పెరూవియన్ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
A tourist plane crashed in Nasca, Ica, Peru. 13 killed. pic.twitter.com/Q0fkJif1fG
— Open Source Intel (@Osint613) August 1, 2026