Prabhas | సుకుమార్ శిష్యుడిగా పరిచయమైన బుచ్చిబాబు సన తన మొదటి సినిమా ఉప్పెనతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఆ చిత్ర విజయంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్‌గా మారిపోయిన బుచ్చిబాబు, రెండో సినిమాకు కాస్త గ్యాప్ తీసుకున్నా, ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్లో మంచి బజ్‌ను సృష్టించింది. ‘పెద్ది’ ఇంకా విడుదల కాకముందే బుచ్చిబాబుకు మరో బిగ్ ఆఫర్ వచ్చిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చాలా బిజీగా ఉంది. ఆయన చేతిలో స్పిరిట్, కల్కి 2898 ఏడీ, సలార్ పార్ట్ 2 వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయినప్పటికీ, మరో కొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.ఇక ‘ది రాజాసాబ్’ ఫలితం ఆశించినంత రాకపోవడంతో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌కు మరో అవకాశం ఇవ్వాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో మరో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నారట.
‘పెద్ది’ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఆ సినిమా పనులు పూర్తయ్యాక బుచ్చిబాబు ప్రభాస్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెడతారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. జానర్, కథా నేపథ్యం వంటి వివరాలు గోప్యంగానే ఉన్నప్పటికీ, ఇది కూడా భారీ బడ్జెట్‌తో రూపొందే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ – బుచ్చిబాబు కాంబినేషన్ నిజంగా సెట్ అయితే, అది టాలీవుడ్లో మరో సెన్సేషన్ కావడం ఖాయం. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు వేచి చూడాల్సిందే.