ముంబై: డ్యూటీ సమయం ముగియడంతో ఫ్లైట్ నడిపేందుకు పైలట్ నిరాకరించాడు. దీంతో విమాన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన సిబ్బందిపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇండిగో విమానంలో గందరగోళం చెలరేగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Chaos On IndiGo Flight) గురువారం ఉదయం 4:05 గంటలకు ఇండిగో విమానం 6ఈ 1085 ముంబై నుంచి థాయ్‌లాండ్‌లోని క్రాబీకి టేకాఫ్ కావాల్సి ఉన్నది.
కాగా, డ్యూటీ సమయం ముగియడంతో విమానాన్ని నడిపేందుకు పైలట్ నిరాకరించాడు. దీంతో క్యాబిన్ సిబ్బంది, విమాన ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ పైలట్ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో విమానంలో కొన్ని గంటలపాటు గంగరగోళం నెలకొన్నది. చివరకు మూడు గంటలు ఆలస్యంగా అది గమ్యస్థానానికి చేరింది.
మరోవైపు ఇండిగో సంస్థ దీనిపై వివరణ ఇచ్చింది. విమానం ఆలస్యంగా రావడం, ట్రాఫిక్ రద్దీ, సిబ్బంది విధుల సమయం ముగియడం వంటి అనేక కారణాలు విమానం ఆలస్యానికి కారణమని ఇండిగో ప్రతినిధి తెలిపారు.
అయితే తమ సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను నిబంధనల ప్రకారం విమానం నుంచి దించి భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు ఇండిగో సంస్థ తెలిపింది. దీని వల్ల మరింత ఆలస్యం జరిగిందని వివరించింది. విమానంలో పలు గంటలు వేచి ఉన్న కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
New:
-Pandemonium in @IndiGo6E flight from Mumbai to Krabi
-Passengers wanted to beat pilot
-Who is said to have refused to operate flight as he was breaching his duty time & had told airline in advance
-But flight was boarded & passengers were stuck inside for 3 hours
— Tarun Shukla (@shukla_tarun) January 15, 2026
Also Read:
Bangladeshi Women | భారత్‌లోకి తిరిగి ప్రవేశించిన బంగ్లాదేశ్ మహిళలు.. అరెస్ట్
103 Year Old Woman | వృద్ధురాలి అంత్యక్రియలకు హాజరైన బంధువులు.. పుట్టిన రోజునే తిరిగి బతికిన ఆమె