హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి( Lakshmi Narasimha Swamy) ప్రధాన ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) ఫిబ్రవరి 18న వైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు (శుక్రవారం) ఉదయం మత్సావతార అలంకారం, శేష వాహన సేవ వేదపారాయణములు వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
కాగా, లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ఈ నెల 28 వ తేదీ వరకు జరుగనున్నాయి. 24న స్వామివారి ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం, 28న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు. ఉత్సవాల సందర్భంగా నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చనలను అధికారు రద్దు చేశారు.