Gajula Ramaram | రాత్రి పూట ఎంక్వైరీ చేసే వీళ్లను దొంగలనాలా..? దొరలనాలా..? : గాజులరామారం బాధితురాలు
Gajula Ramaram | నేను హార్ట్ పేషంట్‌ను. నాకు నిన్ననే సర్జరీ అయింది.. దండం పెడతా అన్నా ఆగలేదు.. ఇంటిదగ్గరికొచ్చాక మీ కాళ్లు మొక్కుతా సార్ అని కాళ్ల మీద పడ్డా. ఇంకేం చేస్తానని గాజులరామారం కూల్చివేతల బాధితురాలు వాపోయింది.
Gajula Ramaram | రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు రాత్రిపూట దొంగతనంగా వచ్చి ఎంక్వైరీలు చేపట్టి కూల్చివేతలు చేపడుతున్నారని గాజుల రామారం బాధితులు మండిపడుతున్నారు. గాజులరామారంలో కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్లతో మరోసారి కూల్చివేతలు చేపట్టడంపై పేద ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు పారిశ్రామిక షెడ్లు, దుకాణాలను కూల్చివేయగా.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు లాఠీలతో కొట్టారు.
ఓ బాధితురాలు మాట్లాడుతూ.. నేను 45 సంవత్సరాలుగా రామారావు ప్రభుత్వం నుంచి ఇక్కడే ఉంటున్నా. నాకు చదువు రాదు. నా పిల్లలు చిన్నగుండె.. ఇప్పుడు నా పిల్లలకే పిల్లలున్నరు. అధికారులు నా దగ్గరు ఉన్న కాగితాలు చూపించే దాకా అయినా ఆగాలి కదా.. నేను హార్ట్ పేషంట్‌ను. నాకు నిన్ననే సర్జరీ అయింది.. దండం పెడతా అన్నా ఆగలేదు.. ఇంటిదగ్గరికొచ్చాక మీ కాళ్లు మొక్కుతా సార్ అని కాళ్ల మీద పడ్డా. ఇంకేం చేస్తానని వాపోయింది.
మొదట నోటీసులు ఇవ్వండి సార్. నేను సామాన్లు సర్దుకుంటా అంటే.. నోటీసులు బాలయ్యకు ఇచ్చినం అన్నరు. ఆయన దివ్యాంగుడు. నేనేమో హార్ట్ పేషంట్‌ను. లక్షాధికారులకేమో నోటీసులు ఇస్తలేరు. గరీబోళ్ల వెంబడి పడ్డరు. మరి లక్షాధికారుల ఇండ్లు కూలగొట్టాలి కదా..? మాకు లంచాలు ఇయ్య చాతగాదు.. అందుకే ఇలా చేస్తున్నరని ఫైర్ అయింది. నా ఇంట్లో నలుగురు పిల్లలున్నరు. 25 కిలోల బియ్యం సంచి ఉంది. మరి మేమెట్లా బతుకాలే.. ఇట్లా రోడ్ల మీద పడి, ఇండ్ల మీదికొస్తే.. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంది.. ఈ ఎమ్మార్వోలు, ఆఐలు వచ్చి ఎంక్వైరీ చేసి రాత్రిపూట ఫోటోలు తీసుకొని పోవడం. తెల్లవారేదాకా ఇండ్ల చుట్టూ ఉండటం.. వీళ్లను దొంగలనాలా..? దొరలనాలా..? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
45 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నాము.. పత్రాలు చూపిస్తామని చెప్పినా అధికారులు వినడం లేదు
నేను హార్ట్ పేషెంట్‌ని.. ఆగండి సార్ అని కాళ్ల మీద పడ్డా కనికరించలేదు
హైదరాబాద్‌లోని గాజులరామారంలో పేదల ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
ఇప్పుడు మమ్మల్ని రోడ్లపై పడేస్తే ఎలా… https://t.co/xuvB53qbY7 pic.twitter.com/8UCTS3LWP2
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2026
Read Also :
KTR | పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేసిన మాట వాస్తవం : కేటీఆర్
Vinesh Phogat | వ్యవస్థ మొత్తం బ్రిజ్ భూషణ్‌నే కాపాడుతుంది: వినేశ్ ఫోగట్
Justice M.S. Liberhan: బాబ్రీ మసీదు ఎంక్వైరీ కమిషన్ హెడ్ జస్టిస్ ఎంఎస్ లిబర్హన్ కన్నుమూత
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

