Ajit Agarkar | అగార్కర్ భవితవ్యంపై ఊగిసలాట.. బీసీసీఐ నిర్ణయం తీసుకునేనా..!
Ajit Agarkar : భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar ) భవితవ్యంపై ఊగిసలాట కొనసాగుతోంది. అక్టోబర్‌లో అగార్కర్ పదవీ కాలం ముగియనుండమే అందుకు కారణం.
Ajit Agarkar : భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar ) భవితవ్యంపై ఊగిసలాట కొనసాగుతోంది. అక్టోబర్‌లో అగార్కర్ పదవీ కాలం ముగియనుండమే అందుకు కారణం. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ వరకూ అతడినే కొనసాగిస్తారా? లేదా తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా కొత్త వారిని ప్రకటిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకూ ఈ అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకోలేదు. అయితే.. శుక్రవారం వార్షిక సమావేశంలో అగార్కర్ గురించి చర్చించే అవకాశముందని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా సభ్యులను బీసీసీఐ ఆదేశించినట్టు సమాచారం.
ఛీప్ సెలెక్టర్‌గా సంచలన నిర్ణయాలతో అజిత్ అగార్కర్ వార్తల్లో నిలిచారు. సీనియర్లను కాదని జూనియర్లకు అవకాశమివ్వడం, కోచ్ గౌతం గంభీర్‌తో కలిసి కుర్రాళ్లను పరీక్షించడం వంటివి కొంతవరకు సత్ఫలితాలనే ఇచ్చాయి. ఈ నేపథ్యంలో అతడి పదవీకాలం ముగిసేందుకు నెల రోజులే ఉంది. వెస్టిండీస్‌తో వన్డే, టీ20లకు స్క్వాడ్ ప్రకటన అనంతరం.. అగార్కర్ భవితవ్యంపై ఏదో ఒక నిర్ణయం వస్తుందని అంతా ఊహించారు.
Ajit Agarkar’s future as chairman of selectors is up in the air.
Here’s what we know so far 🧵… (1/2) pic.twitter.com/zzPgnd4nfz
— Cricbuzz (@cricbuzz) September 18, 2026
కానీ, బీసీసీఐ మాత్రం హడావిడికి చోటివ్వకుండా.. ఇంకా టైమ్ ఉందిలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అయితే.. క్రిక్‌బజ్ కథనం ప్రకారం శుక్రవారం జరిగిన 95వ బోర్డు వార్షిక సమావేశంలో అగార్కర్ గురించి ఓ నిర్ణయానికి రావాలని సభ్యులకు బీసీసీఐ సూచించిందని సమాచారం. అలానే జూనియర్ క్రికెట్ టీమ్ సెలెక్టర్ల మార్పుపై కూడా స్పష్టత రానుందని టాక్. ఒకవేళ అగార్కర్‌కు బీసీసీఐ గుడ్‌బై చెబితే.. తదుపరి చీఫ్ సెలెక్టర్ రేసులో మాజీ ఆటగాళ్లు పార్థీవ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓఝాలు ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
రెండు వరల్డ్‌కప్‌లు
టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ హయాం మిశ్రమ ఫలితాలనిచ్చింది. అతడు బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టు అనూహ్యంగా ఓడిపోయింది. కానీ, మరుసటి ఏడాది పొట్టి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది భారత్. 2024లో రోహిత్ శర్మ బృందం దక్షిణాఫ్రికాను చిత్తు చేసి రెండోసారి టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిచింది.

అదే ఊపులో స్వదేశంలో న్యూజిలాండ్‌ను చిత్తు చేయాల్సిన టీమిండియా మాత్రం వైట్‌వాష్‌కు గురైంది. ఆటగాళ్ల పేలవ ప్రదర్శనతో సొంత గడ్డపై 12 ఏళ్ల తర్వాత మొదటి సిరీస్ కొల్పోయింది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలోనూ తేలిపోయిన భారత్.. స్వదేశంలో మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. విశ్వవిజేతగా ఐర్లాండ్, ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన శ్రేయాస్ అయ్యర్ సేన.. క్లీన్‌స్వీప్ అయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

