ముంబై: మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత నానా పటోలే పాదాలను ఇద్దరు వ్యక్తులు కడుగుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ సంస్కృతికి ఇది నిదర్శనమని బీజేపీ మంత్రి విమర్శించారు. అయితే విరాళాలు దోచుకునే వారు మాకు సలహా ఇవ్వనవసరం లేదంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. (Nana Patole) గురుపౌర్ణమి సందర్భంగా నానా పటోలే సోఫాలో కూర్చోగా ఇద్దరు వ్యక్తులు ఆయన పాదాలు కడిగారు. అలాగే ఆయనపై పూలు చల్లడంతో పాటు కొన్ని పండ్లను పాదాల వద్ద ఉంచారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీకి చెందిన రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవంకులే దీనిపై స్పందించారు. ‘ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడటం కాంగ్రెస్ నాయకుల సంస్కృతి. వారు ఇలాంటి సంఘటనల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. విమర్శలు, ప్రతికూల ప్రచారం తప్ప మరేమీ సంపాదించలేని ఇలాంటి పద్ధతులకు ఎందుకు పాల్పడతారు?’ అని ఎక్స్‌లో విమర్శించారు.
మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్, అసెంబ్లీ మాజీ స్పీకర్ అయిన నానా పటోలే బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు. తాను ఎవరినీ అలాంటి ఆచారం పాటించమని అడగలేదని లేదా బలవంతం చేయలేదని తెలిపారు. ‘ఆ రోజు గురు పూజ. నా కుటుంబంలోని ఇద్దరు యువకులు ఇది చేశారు. నన్ను తమ గురువుగా భావిస్తామని, గౌరవ సూచకంగా ఇది చేయాలనుకుంటున్నామని పట్టుబట్టారు’ అని వివరణ ఇచ్చారు.
అలాగే సంస్కృతి, సంప్రదాయాలపై ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే హక్కు బీజేపీకి లేదని నానా పటోలే అన్నారు. ‘మా విరాళాలను దోచుకునే వారు మాకు సలహా ఇవ్వనవసరం లేదు’ అని అయోధ్య రామ మందిర విరాళాల చోరీని పరోక్షంగా ప్రస్తావించారు.
Nagpur,Maharashtra – A controversial video of former Maharashtra Congress president Nana Patole has gone viral on social media, showing him washing feet with milk.The clip has triggered a wave of anger against Patole, with many criticising the act as contrary to the ideology of… pic.twitter.com/jyiCznhXdg
— NextMinute News (@nextminutenews7) August 2, 2026