నైపితా: ఆంగ్ సాన్ సూకీ(Aung San Suu Kyi) క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. సుమారు 2.5 ఏళ్ల తర్వాత ఆమె తొలిసారి బయటి ప్రపంచానికి కనిపించారు. రెడ్‌క్రాస్‌కు చెందిన అంతర్జాతీయ కమిటీ సభ్యుడితో ఆమెతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ఫోటోలను మయన్మార్ మిలిటరీ అధికారులు రిలీజ్ చేశారు. బర్మా నేత ఆంగ్ సాన్ సూకీ .. ఆర్మీ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఆంగ్ సూకీ ఆచూకీ లేదని రెండున్నర ఏళ్ల క్రితం ఆమె కుమారుడు ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. మిలిటరీ సర్కారు రిలీజ్ చేసిన ఫోటోల్లో సూకీ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు.
2021లో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చి.. ఆర్మీ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఆమెను నిర్బంధించిన విషయం తెలిసిందే. వేర్వేరు కేసుల్లో ఆమెకు 33 ఏళ్ల జైలుశిక్ష విధించారు. అయితే ఆమెపై శిక్షను తగ్గించి, గృహ నిర్బంధానికి తరలించారు. సూకీ ప్రాణాలతో ఉన్నట్లు పలుసార్లు ఆర్మీ హామీ ఇచ్చింది. కానీ గతంలో ఎటువంటి ఆధారాలు చూపలేదు. అయితే సుమారు రెండున్నర ఏళ్ల తర్వాత ఆమె ఫోటోలు రిలీజ్ కావడం గమనార్హం. ఆమె కుమారుడు కిమ్ ఆరిస్ గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 81 ఏళ్ల సూకీ సజీవంగా ఉన్నట్లు ఆధారాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.