9/11 అమరులకు నివాళిగా.. గ్రాడ మెగా రక్తదాన శిబిరం
9/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ గ్రాడ ఆధ్వర్యంలో ఫ్రిస్కోలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 50 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఫ్రిస్కో: 9/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళిగా అమెరికాలోని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా (GRADA) సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్టర్ బ్లడ్కేర్ సహకారంతో ఫ్రిస్కోలోని స్పైసీ వెన్యూ వేదికగా నాలుగో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమానికి ఫ్రిస్కో నగర మేయర్ మార్క్ హిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్తదాతలను, నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. సమాజ హితం కోసం గ్రాడ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.
కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకంగా వ్యవహరించిన కోఆర్డినేటర్లు ఉమా మహేశ్వర్, హరినాథ్, జగదీష్లతోపాటు యువ వాలంటీర్లను గ్రాడ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గాలి, కార్యదర్శి రాజు కంచం, ఈసీ కార్యవర్గ సభ్యులు అభినందించారు. సంస్థ వ్యవస్థాపకులు డా. దర్గా నాగిరెడ్డి, చెన్నారెడ్డి కొర్విలకు గ్రాడ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. వారి మార్గదర్శకత్వంతో సమాజానికి ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొంది.
రక్తదాన శిబిరానికి వేదికను కేటాయించి సహకరించిన స్పైసీ వెన్యూ రెస్టారెంట్ యజమాని సునీల్కు, విలువైన రక్తాన్ని దానం చేసి ప్రాణాలను కాపాడేందుకు ముందుకొచ్చిన రక్తదాతలందరికీ గ్రాడ బృందం ధన్యవాదాలు తెలిపింది.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

