The Paradise | ‘ది ప్యారడైజ్’లో ఆ సీన్పై ఇంత వివాదమా .. అసలు ఉద్దేశం ఇదేనంటున్న శ్రీకాంత్ ఓదెల
The Paradise | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మూడు రోజుల్లోనే రూ.136 కోట్ల గ్రాస్ సాధించినట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే సినిమాకు కలెక్షన్లు వస్తున్నప్పటికీ.. ఇందులోని కొన్ని సన్నివేశాలు మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
The Paradise | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మూడు రోజుల్లోనే రూ.136 కోట్ల గ్రాస్ సాధించినట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే సినిమాకు కలెక్షన్లు వస్తున్నప్పటికీ.. ఇందులోని కొన్ని సన్నివేశాలు మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా హీరోయిన్ కయాదు లోహార్ పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశంపై నెటిజన్లు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమాలో కయాదు పోషించిన పాత్ర తన తండ్రి మరణం తర్వాత ఆయన మిగిల్చిన అప్పులను తీర్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ క్రమంలో ఆమె బీ-గ్రేడ్ వీడియోల్లో నటించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సన్నివేశాలను ఆమె తల్లే స్వయంగా కెమెరాలో చిత్రీకరిస్తుంది.
అంతేకాదు.. కూతురి నటనను చూసి తల్లి ‘‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్వి బిడ్డా’’ అంటూ ప్రశంసిస్తుంది. ఈ సన్నివేశం ప్రేక్షకుల్లో భిన్నమైన స్పందనకు కారణమైంది. కూతురు అర్ధనగ్నంగా నటిస్తున్న సమయంలో కన్నతల్లి స్వయంగా వీడియో తీసి, పైగా ఆమెను ప్రశంసించడం ఏమిటంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. తల్లి పాత్రను ఇలా చూపించడం కుటుంబ విలువలకు విరుద్ధంగా ఉందని కొందరు విమర్శించారు. అసలు ఈ సన్నివేశాన్ని ఎందుకు రాశారు? ఇలాంటి సంభాషణను ఎలా పెట్టారు? అంటూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది.ఈ నేపథ్యంలో హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్వయంగా ఈ వివాదాస్పద సన్నివేశంపై స్పందించారు. ప్రేక్షకులు, నెటిజన్లు లేవనెత్తిన ప్రశ్నలకు నాని ప్రశ్నలు అడగగా.. శ్రీకాంత్ ఓదెల అసలు సన్నివేశం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు.
శ్రీకాంత్ ఓదెల చెప్పిన వివరాల ప్రకారం.. చిన్నతనంలో కయాదు పాత్ర హీరోయిన్ కావాలనే కలతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అయితే ఆమె తల్లి ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ‘‘నీకు నటన రాదు.. నిన్నెవరు హీరోయిన్ను చేస్తారు? చివరికి ఓడిపోయి మళ్లీ ఇక్కడికే వస్తావు’’ అంటూ ఆమెను అవమానిస్తుంది.కానీ ఆ తర్వాత కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. జీవితంలో ఎదురైన కష్టాల కారణంగా అదే అమ్మాయి తన తల్లి ముందే ఆ పరిస్థితుల్లో నటించాల్సి వస్తుంది. అప్పటివరకు కూతురిలో నటనా ప్రతిభ లేదని భావించిన తల్లి.. ఆ సమయంలో ఆమె చూపించిన భావోద్వేగాలను, నటనను చూసి ఆశ్చర్యపోతుంది. గతంలో తాను కూతురి ప్రతిభను గుర్తించలేకపోయాననే పశ్చాత్తాపం ఆమెకు కలుగుతుంది. ఆ భావనను వ్యక్తం చేయడానికే ‘‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్వి బిడ్డా’’ అనే డైలాగ్ పెట్టినట్లు శ్రీకాంత్ ఓదెల వివరించారు.
అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చిందని దర్శకుడు స్వయంగా అంగీకరించారు. ఈ సన్నివేశానికి ముందు కయాదు చిన్నతనానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించినప్పటికీ.. సినిమా నిడివి ఎక్కువ కావడంతో ఎడిటింగ్ సమయంలో వాటిని తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో తల్లి–కూతుళ్ల మధ్య గతంలో జరిగిన సంఘటనలు ప్రేక్షకులకు పూర్తిగా అర్థం కాలేదని వివరించారు.దీంతో అసలు ఉద్దేశం పక్కకు వెళ్లిపోయి.. తల్లి తన కూతురిని ఆ పరిస్థితుల్లోకి నెట్టినట్లు, పైగా ఆమెను ప్రోత్సహిస్తున్నట్లు ప్రేక్షకులకు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఏర్పడిందని శ్రీకాంత్ ఓదెల తెలిపారు. తన ఆలోచనలో తప్పు లేకపోయినా.. దాన్ని తెరపై చూపించిన విధానంలో లోపం జరిగిందని ఆయన అంగీకరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

