సూర్యాపేట : సూర్యాపేట(Suryapeta) జిల్లా పెన్ పహాడ్ మండలం ధర్మాపురం గ్రామంలోని మధిరామక్క చెరువులో శుక్రవారం ఉదయం గ్రామస్తులకు నీటి కుక్క(Otter ) కనిపించింది. గ్రామస్తులకు వింతగా కనిపించిన ఆ జంతువును యువకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెద్ద పెద్ద సముద్రాలలో కనిపించే నీటి కుక్క.. తమ గ్రామ చెరువులో కనిపించడంతో ఈ నీటీ కుక్క చూడడానికి గ్రామస్తులు చెరువు దగ్గరికి పరుగులు తీశారు.
దీంతో ఆ నీటి కుక్క నెమ్మదిగా నీటిలోకి జారుకుంది. తమ చెరువులోకి నీటి కుక్క ఎలా వచ్చిందని ఒకవైపు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, నీటి కుక్కని ప్రత్యక్ష్యంగా చూసామని మరోవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.