లక్నో: కాబోయే పెళ్లికూతురైన లేడీ కానిస్టేబుల్ పెళ్లికి ముందు అదృశ్యమైంది. ఆమెను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావించారు. అయితే ప్రియుడైన హత్య కేసు నిందితుడితో కలిసి ఆ మహిళా పోలీస్ పారిపోయినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. (constable elope with murder accused) ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల లేడీ కానిస్టేబుల్ సంధ్యా భరద్వాజ్ అలీగఢ్‌లోని సైబర్ క్రైమ్ సెల్లో పనిచేస్తున్నది. ముజఫర్ నగర్లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అతుల్ శర్మతో ఆమెకు పెళ్లి సంబంధం కుదిరింది. ఫిబ్రవరి 8న అతడితో పెళ్లి జరుగాల్సి ఉన్నది.
కాగా, పెళ్లికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 7న రాత్రి వేళ లేడీ కానిస్టేబుల్ సంధ్యా అదృశ్యమైంది. హత్య కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన రౌడీ షీటర్ అంకిత్ చౌహాన్ తమను బెదరించి తన కుమార్తెను కిడ్నాప్ చేసినట్లు ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. లేడీ కానిస్టేబుల్‌ను వెతికేందుకు పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
మరోవైపు హత్య కేసు నిందితుడైన అంకిత్ చౌహాన్, మహిళా పోలీస్ సంధ్యా ప్రియుడని దర్యాప్తులో తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. వారిద్దరి మధ్య సంబంధం ఉండటంతో అతడితో కలిసి ఆమె పారిపోయినట్లు గ్రహించారు. ఆ తర్వాత లేడీ కానిస్టేబుల్ సంధ్యా ఆచూకీని గుర్తించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నించారు.
అయితే తన ఇష్టప్రకారమే అంకిత్‌తో కలిసి పారిపోయినట్లు కానిస్టేబుల్ సంధ్యా పోలీసులకు చెప్పింది. దీంతో ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఆమె కుటుంబానికి అప్పగించారు. ఈ నేపథ్యంలో పెళ్లిని ఆమె కుటుంబం రద్దు చేసింది. అయితే పోలీసుల కళ్లగప్పి తప్పించుకున్న అంకిత్ చౌహాన్, ఫిబ్రవరి 10న జిల్లా కోర్టులో లొంగిపోయాడు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read:
Watch: బురఖా ధరించి లేడీస్ కోచ్‌లో ప్రయాణించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Husband arrested | భార్య ప్రైవేట్ వీడియో లీక్ చేసిన భర్త.. అరెస్ట్ చేసిన పోలీసులు
Woman Appears Exam With Baby | పది రోజుల బిడ్డతో.. 12వ తరగతి పరీక్షకు హాజరైన యువతి
students slit hands | బ్లేడ్‌తో చేతులపై కోసుకున్న 35 మంది విద్యార్థులు.. పేరెంట్స్ షాక్